Rahul Dravid's Son Samit Slams Ton in Age-Group Cricket

Dravid jr scores century for club team

Bangalore United Cricket Club, BUCC, Cricket, Delhi Daredevils, India, IPL, Rahul Dravid, Samit Dravid, Tiger Cup

Rahul Dravid eldest son Samit is proving that he is a chip off the old 'wall'. The 10-year-old scored a century in an Under-14 tournament in Bangalore.

అచ్చంగా తండ్రిలాగే.. సమిత్ కూడా శతకం బాదాడు..

Posted: 04/21/2016 08:05 PM IST
Dravid jr scores century for club team

రాహుల్ ద్రవిడ్ అనగానే భారతీయ క్రికెట్ లో ద వాల్ అనే పేరు ఠక్కున గుర్తుకొస్తుంది. టెస్టు క్రికెట్ మొదలుకుని అన్ని రకాల క్రికెట్ ఫార్మెట్ లలో తన సత్తా ఏమిటో చాటుకున్న ద్రావిడ్.. జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా కాపాడుకోవడమే కాక.. అత్యంత క్లాసీ షాట్లు ఆడి జటను విజయతీరాలకు చేర్చడంతో ఆయనను మించినవాళ్లు లేరని క్రికెట్ పరిశీలకులు, విమర్శకులు కూడా చెబుతారు. ఆయన రిటైర్మెంట్ తరువాత ఇప్పుడీ టాపిక్ ఎందుకా అంటారా..?

తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తు.. అదే తరహాలో క్రికెట్ లో రాణిస్తున్న ఆయన తనయుడు ఆయనను గుర్తుచేశాడు. గట్టిగా పదేళ్ల వయసు ఉందో లేదో.. అప్పుడే తన తండ్రి ఆటను అభిమానులు గుర్తు చేసుకునేలా అద్భుతమైన షాట్లు కోడుతూ అండర్ -14 క్లబ్ క్రికెట్‌లో సెంచరీ చేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి. బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు. తన కొడుకు బ్యాటింగ్ తీరు పట్ల ద్రావిడ్ కూడా పొంగిపోతున్నాడు. అతడి కళ్లకు, చేతులకు మధ్య మంచి సమన్వయం ఉందని, బాల్ రాగానే దాన్ని స్మాష్ చేసేస్తాడని.. అలాగే చేయమని తాను కూడా చెబుతున్నానని ద్రావిడ్ అన్నాడు. ఎంతైనా పుత్రోత్సాహం కదా..!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore United Cricket Club  BUCC  Cricket  Delhi Daredevils  India  IPL  Rahul Dravid  Samit Dravid  Tiger Cup  

Other Articles