Dhoni responds playfully to reporter's retirement question

Ms dhoni s bizarre response to question from australian journalist

ICC T20 World Cup, Indian Cricket, team india, Rahane, virat kohli, Australian journalist, Rohit Sharma, Yuvraj Singh, suresh raina, MS dhoni, india vs west indies, ind vs wi, wankhede stadium, mumbai, Virat Kohli, Ravi shastri, Cricket

THE interviewer became the interviewee as an Australian journalist became the unwitting star of MS Dhoni’s press conference following India’s World Twenty20 semi-final loss to West Indies.

ఆసీస్ జర్నలిస్టుతో సమాధానం చెప్పించిన ధోని

Posted: 04/01/2016 06:55 PM IST
Ms dhoni s bizarre response to question from australian journalist

టీ20 ప్రపంచ కప్ క్రికెట్ లో సెమీఫైనల్స్ లో పరాజయం పాలైన నేపథ్యంలో మళ్లీ తెరపైకి తన రిటైర్మెంట్ అంశం తలెత్తడంపై విదేశీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని విభిన్నంగా స్పందించాడు. విండీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని విలేకరులతో మాట్లాడుతుండగా ఆస్ట్రేలియా జర్నలిస్ట్ శామ్యూల్స్ ఫెర్సిస్ ఈ ప్రశ్న వేశాడు. వెంటనే స్పందించిన ధోని అతడిని తన పక్కన కూర్చోమని కుర్చీ చూపిస్తూ వేదికపైకి ఆహ్వానించాడు.

అతడు కుర్చీలో కూర్చొగానే భుజంపై చేయి వేసి సరదాగా ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను రిటైర్ కావాలని కోరుకుంటున్నావా అని ప్రశ్నించాడు. 'నో నేను కోరుకోవడం లేదు. రిటైర్మెంట్ పై మీరేం చెబుతారో వినాలనుకుంటున్నా' అని ఫెర్సిస్ సమాధానం ఇచ్చాడు. 'భారత జర్నలిస్టులు ఎవరైనా ఈ ప్రశ్న వేసుకుంటే మీ కొడుకు లేదా తమ్ముడెవరైనా వికెట్ కీపర్ గా ఉన్నారా అని అడిగేవాడిని. ఎందుకంటే నేను తప్పుకుంటే వారికి అవకాశం దక్కుతుంది కాబట్టి. కానీ నిన్ను ఆ ప్రశ్న అడగలేకపోతున్నాను. నేను ఫిట్ గా లేనని భావిస్తున్నావా, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం లేదా' అని ధోని ప్రశ్నించాడు.

'నో.. నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు' అని ఫెర్రిస్ జవాబిచ్చాడు. '2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడలేనని భావిస్తున్నావా' అని మళ్లీ ధోని ప్రశ్నించగా 'అదేమి లేదంటూ' ఫెర్రిస్ బదులిచ్చాడు. 'నీ ప్రశ్నకు నువ్వే  సమాధానం ఇచ్చావు' అంటూ మిస్టర్ కూల్' అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  India vs west indies  MS dhoni  Australia journalist  

Other Articles