వరల్డ్ టీ 20లో తన భాగస్వాములతో కలసి చక్కగా రాణిస్తున్న టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఇకపై జరిగే సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచుల ఆడటం లేదు. చీలమండ గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గురువారం ముంబైలో వెస్టిండీస్ తో జరగనున్న సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం యువరాజ్ స్థానంలో మనీశ్ పాండేను జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు నిర్ధారించారు. నిజానికి యువరాజ్ గాయపడ్డప్పుడే మనీశ్ జట్టులోకి వస్తాడని ఊహించినప్పటికీ బుధవారం సెలెక్టర్ల ప్రకటనతో అది ఖరారయింది.
సెమీస్ లోకి ప్రవేశించేందుకు గత ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగన అమీతుమీ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఒక్కసారిగా కూలబడ్డ యువరాజ్ ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తొలి, మలి టీ20 వరల్డ్ కప్ ల్లో సత్తా చాటినంతగా యువరాజ్ ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన అతను.. కేవలం 63 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పాకిస్థాన్ పై సాధించిన 24 పరుగులే అత్యధిక స్కోరు. మూడు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసే అవకాశం రాని యువరాజ్ ఆసీస్ తో జరిగి మ్యాచ్ లో మాత్రం మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more