It was painful to see Waqar Younis apologising, says Shoaib Akhtar

Waqar failed to deliver says rameez raja

waqar younis, shoaib akhtar, pakistan cricket team, pakistan cricket, pakistan cricket coach, public apology, Ramiz Raja, Muhammad Yousuf, pcb, icc world t20, t20 world cup, cricket news, cricket

Shoaib Akhtar said although Waqar Younis had apologised but each and every person in the team and the PCB was responsible for the decline.

వకార్ క్షమాపణలపై సీనియర్ల మిశ్రమ స్పందనలు

Posted: 03/30/2016 08:42 PM IST
Waqar failed to deliver says rameez raja

వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ వకార్ యూనస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నివేదిక సమర్పించిన వకార్..  జట్టు ప్రదర్శనపై క్షమాపణలు తెలియజేశారు. అనంతరం పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన వకార్.. అసలు తమ జట్టులో లోపాలు ఎక్కడున్నాయన్న దానిపై చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. దీనికి ఏ ఒక్కర్నో నిందించడం సరికాదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జట్టులోని అంతర్గత లోపాలపై క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వకార్ అన్నాడు.
 
'వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా బాధించింది.  జట్టు ప్రదర్శనపై సుదీర్ఘంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నేను పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళతా. \పాకిస్తాన్ జట్టులో ఎటువంటి రాజకీయాలు, గ్రూప్ లు లేవు. కేవలం మాది పేలవ ప్రదర్శన మాత్రమే. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా దేశవాళీ క్రికెట్ కూడా చాలా బలహీనంగా ఉంది. మా దేశంలో ఎక్కువ క్రికెట్ ఆడకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని అన్నాడు.

అయితే వకార్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడంపై పీనియర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి, క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు.

బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్  ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Waqar Younis  pakistan  public apology  Ramiz Raja  Muhammad Yousuf  world twenty 20  

Other Articles