India vs Pakistan World T20: virat half century steered India to six wicket victory

India beat pakistan by 6 wickets

world t20, world t20 updates, India, ind vs pak, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, t20 world cup-2016, pakistan, ICC T20 WC, India vs pakistan, jasprit bumrah, mohammed shami, hardik pandya, yuvvraj, kohli, rohit sharma, cricket news, cricket

Virat Kohli unbeaten on 55 and steered India to a six-wicket win over Pakistan at the Eden Gardens in the World T20.

హిస్టరీ మనదే.. ఈడెన్ మనేదే.. పాక్ పై టీమిండియా విజయం

Posted: 03/20/2016 08:57 AM IST
India beat pakistan by 6 wickets

వరల్డ్ టీ 20లో భాగంగా ఈడన్ గార్డన్ స్టేడియంలో మెగా ఈవెంట్ గా అభివర్ణించబడిన దాయాధులు భారత్, పాక్ పోరులో గతం నుంచి కొనసాగుతున్న చరత్రనే మరోమారు భారత్ సువర్ణాక్షారాలతో లిఖించింది. మేము బంగ్లాదేశ్ పై గెలిచి విజయదరహాసంతో బరిలోకి దిగుతున్నాం.. మీరు ఓటమిని చవిచూసి ఒత్తిడిలో వున్నారని భారత్ బలంపై దెబ్బతీసే ప్రయత్నాలకు ధోని సేన ధీటుగా బదులిచ్చింది. దీనికి తోడు ఈడెన్ గార్డెన్ తమకు అచ్చి వచ్చిన మైదానమని.. భారత్ సెంటిమెంటును కూడా విచ్చిన్నం చేసే యత్నాలకు కూడా టీమిండియా తన విజయంతోనే సమాధానం చెప్పింది.

టి20 ప్రపంచకప్‌లో భారత్ బరిలో నిలవడానికి కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో దాయాదిపై విజయంతో మళ్లీ రేస్‌లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని చిత్తు చేసి వరల్డ్‌కప్‌లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో  భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. మూడు విక్కెట్లను త్వరుగానే చేజార్చుకున్న టీమిండియాకు రోహిత్, యువరాజ్ సింగ్ చక్కని భాగస్వామ్యం విజయతీరాలకు చేర్చింది.

మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఎదుట పాకిస్తాన్ 119 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది. ఈ జోడి 41 పరుగుల  భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.  దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

లక్ష్యచేధనకు దిగని టీమిండియా రోహిత్ (10) వికెట్ ను కల్పోయింది. ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి హాట్రిక్ కు బరిలో నిలువగా, ఆ వెంటనే వచ్చిన యువరాజ్ మొదట్లో కాస్త కంగారుపడినా.. ఆ తరువాత విరాట్ కోహ్లీ తో కలసి చక్కని భాగస్వామ్యంతో ఆకట్టకున్నాడు. ఇక ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్‌తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  pakistan  ICC T20 WC  India vs pakistan  

Other Articles