Rahul Dravid believes India will reach semi-finals of ICC World T20 2016

India would definitely be in semis of world t20 says dravid

icc world t20, icc world t20 2016, world t20, world t20 updates, world t20 news, world t20 scores, india cricket, cricket india, rahul dravid, rahul dravid india, dravid runs, ms dhoni, sports news, sports, cricket news, cricket

"I think the good thing about this Indian team and this T20 World Cup is they have good depth, they have good all-round depth at the moment," said Rahul Dravid.

ఔనా..! నిజమేనా..!! ధోనిసేనపై రాహుల్ అలా అన్నాడా..?

Posted: 03/12/2016 05:07 PM IST
India would definitely be in semis of world t20 says dravid

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ అని పలువురు దేశీయ, విదేశీయ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ కెప్టెన్, టీమీండియా బావి జట్టు సహా అండర్ 19 జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా ఫైనల్ కు చేరకునే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. అయితే పొట్టి క్రికెట్లో ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న టీమిండియా.. అసియా కప్ తో పాటు అంతకుముందు రెండు క్రికెట్ సిరీస్ లు గెలుచుకున్న దోసిసేనపై రాహుల్ విభిన్నంగా స్పందించాడు.

టి-20 ప్రపంచ కప్లో ఖచ్చితంగా ధోని సేన సెమీస్లో ఆడుతుందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో ధోనీసేన అత్యంత పటిష్టమైన జట్టుగా కనిపిస్తోందని చెప్పాడు. ఈ నెల 15 నుంచి టి-20 ప్రపంచ కప్ ప్రధాన మ్యాచ్లు జరగనున్నాయి. 'ప్రపంచ కప్లో భారత్ సెమీస్లో ఆడుతుంది. అయితే సెమీస్ లేదా ఫైనల్లో ఏ జట్టుకు కలిసి వస్తుందో చెప్పలేం. భారత్ ఈ టోర్నీ కోసం ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తోంది. భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలోపేతంగా ఉంది. యువ ఆటగాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు' అని ద్రావిడ్ అన్నాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc world t20  rahul dravid  T20 World Cup  Cricket  

Other Articles