IPL spot-fixing: BCCI bans Pakistan umpire Asad Rauf for 5 years

Bcci bans pakistani umpire asad rauf for 5 years

2013 IPL spot-fixing scandal, Asad Rauf, BCCI Disciplinary committee, Board of Control for Cricket in India, Crime branch, Rauf, Bowden dropped from Elite umpires' list, ICC pull umpire Rauf from Champions Trophy, India cricket, Pakistan cricket

The Disciplinary Committee of BCCI, banned controversial Pakistan umpire Asad Rauf for five years from any form of cricket that falls under purview of the Indian Board

పాకిస్థాన్ అంఫైర్ పై బీసీసీఐ ఐదేళ్ల వేటు..

Posted: 02/12/2016 07:57 PM IST
Bcci bans pakistani umpire asad rauf for 5 years

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పోటీల సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ అంపైర్ పై బీసీసీఐ బహిష్కరణ వేటు వేసింది. ముంబయిలో ఇవాళ సమావేశమైన క్రమశిక్షణా కమిటీ మీటింగ్ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధించి ఆడే క్రికెట్ లో ఏ విధంగానూ రఫూప్ కు ప్రమేయం లేకుండా చూడాలని అదేశాలు జారీ చేసింది.

దీంతో బిసిసిఐ పరిధిలో జరిగే ఏ మ్యాచ్ లకు ఇక రవూఫ్ అంపైరింగ్ చేసే అవకాశం లేదు. 2013 ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్ ల్లో మైదానంలో నిలబడి అంపైరింగ్ చేసిన రవూఫ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆటగాళ్లు అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాలపై ఇప్పటికే బీసీసీఐ చర్యలు తీసుకుంది. రవూఫ్ పాత్రపై విచారించిన ఐసీసీ క్రమశిక్షణా కమిటీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి అతన్ని పక్కనబెట్టగా, ఇప్పుడు బీసీసీఐ శిక్షను ఖరారు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2013 IPL spot-fixing scandal  Asad Rauf  BCCI Disciplinary committee  

Other Articles