Team India great victory

Team india great victory

India, Australia, T20, India Victory, Australia Tour

The format change finally brought some cheers for Team India as their preparations for World Twenty20 got off to a perfect start. Bowlers seemed to have found their mojo back as they helped India defend their total for the first time on this tour. Australia were bowled out for 151 in 19.3 overs in a massive chase of 189.

టీమిండియా రిపబ్లిక్ డే స్వీట్ విక్టరీ

Posted: 01/26/2016 06:41 PM IST
Team india great victory

వన్డేల్లో చివరి వన్డే ఇచ్చిన కిక్కుతో తొలి టీ20లో మనవాళ్లు భేష్ అనిపించారు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ లో జరుగిన తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ సాధించారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 19.2 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 37 పరుగల తేడాతో రిపబ్లిక్ డే రోజు స్వీట్ విక్టరీ కొట్టింది ఇండియా. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను మొదట బ్యాటింగ్ కు దించింది. భారతజట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ-20 మ్యాచ్ లసీరీస్ లో 1-0తో ఆధిక్యత సాధించింది.

భారతజట్టు ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ మరో సారి రాణించాడు 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 2 సిక్సర్లు, 9 బౌండ్రీలతో సాధించిన 90 పరుగులు భారత జట్టు విజయానికి బాటలు వేశాయి. సురేష్ రైనా 34 బంతుల్లో 1 సిక్సర్, 3 బౌండ్రీలతో 41 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన ధోనీ 3 బంతుల్లో ఓసిక్సర్, ఓ బౌండ్రీతో 11 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆరంభంలో మెరుపులు కురిపించినా,, వరుస వికెట్లను పోగొట్టుకుంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు అయ్యాయి. వరుసగా వార్నర్ ( 17), స్మిత్ (21), హెడ్ (10) లేయాన్ 17, వాట్సన్ 12 చేశారు. బూమ్రా 3 వికెట్లు, అశ్విన్, హార్దిక్ పాండ్యా, జడేజా చెరి రెండు వికెట్ల తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  T20  India Victory  Australia Tour  

Other Articles