India vs Australia: Glenn Maxwell Doubtful for Fifth ODI Due to Injury

Glenn maxwell doubtful for fifth odi against india

"india vs australia, ind vs aus, india vs australia 4th odi, india australia, australia vs india, aus vs ind, glenn maxwell, maxwell, maxwell news, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, maxwell australia, australia cricket, cricket australia, india tour of australia, cricket news, cricket updates, cricket

Glenn Maxwell was struck on the right knee during the early stages of his innings against India at Canberra.

గాయం కారణంగా ఐదో వన్డేకు మాక్స్ వెల్ దూరం..

Posted: 01/21/2016 07:42 PM IST
Glenn maxwell doubtful for fifth odi against india

అస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ లో మిగిలిన ఐదవది చివరిదైన మ్యాచ్ ను కైవసం చేసుకోడానికి భారత్ కు అవకాశం వచ్చింది. అతిథ్య జట్టులో విధ్వంసకర బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ భారత్ తో చివరి వన్డేకి దూరమయ్యాడు. భారత్ తో వన్డే సిరీస్ లో తన బ్యాట్ తో పరుగుల వరదను కొనసాగించిన మాక్స్ వెల్ దూరం కావడాన్ని అందివచ్చిన అవకాశంగా ధోనిసేన అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరి మ్యాచ్ నైనా గెలిచి అస్ట్రేలియాకు క్లీస్ స్వీప్ ఛాన్స్ ను అందించవద్దని సూచిస్తున్నారు.

కాన్ బెర్రా వేదికగా భారత్ తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేసిన బంతి మ్యాక్స్ వెల్ మోకాలి కింది భాగంలో బలంగా తాకింది. అయినప్పటికీ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించి కేవలం 20 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. ఆ తరువాత అనంతరం కాసేపు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసిన మ్యాక్స్ వెల్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి పది పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సందర్భంగా గాయం ఇబ్బంది పెట్టడంతో మైదానం వీడాడు. అనంతరం ఫిజియో సూచనల మేరకు మ్యాక్స్ వెల్ కు చివరి వన్డేలో విశ్రాంతి ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aus vs ind  glenn maxwell  5th odi  australia  

Other Articles