India lose, Australia lead ODI series 4-0

Aus vs ind india loses once again

ind vs aus, india vs australia, india australia, australia vs india, virat kohli, kohli, shikhar dhawan, dhawan, cricket,4th ODI, Aaron Finch, Australia, Australia vs India 2016, Canberra, Cricket, free cricket streaming, George Bailey, India, Josh Hazlewood, MS Dhoni, Ravichandran Ashwin, Rohit Sharma, Steven Smith, Virat Kohli

Kane Richardson took five wickets, including four in his last four overs, as Australia held on to beat India by 25 runs and extend its lead to 4-0

మళ్లీ ఓటమే పునరావృతం అయ్యింది.. క్లీన్ స్వీప్ దిశగా అసీస్..

Posted: 01/20/2016 07:06 PM IST
Aus vs ind india loses once again

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ధోని సేన వరుసగా నాలుగో వన్డేలోనూ ఓటమి పాలై పాతన కథనే పునారావృతం చేసింది. దీంతో అతిధ్య జట్టు 4-0తో దూసుకుపోతుంది. కాన్‌బెరాలో జరిగిన నాలుగో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ ధాటిగా అడినా.. వారి తరువాత స్కోరు బోర్డును ముందుకు నడిపించడంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. ఇక చివరి వరుసలో నిలిచే బ్యాట్స్ మెన్లు అసీస్ బౌలర్ల ధాటికి వరుస విక్కెట్లను సమర్పించుకున్నారు. దీంతో నాల్గవ టెస్టులో ధోనిసేన పై ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లీ (106), ధావన్ (126) అద్బుతంగా రాణించి రెండో వికెట్కు 212 పరుగుల భాగస్వాయ్యం నమోదు చేసినప్పటికీ జట్టును మరో ఓటమి నుంచి తప్పించలేకపోయింది. జట్టు స్కోరు 277 పరుగుల వరకు భారత్ పటిష్టస్థితిలోనే ఉంది. కానీ, అదే స్కోరు వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోవడం భారత్ను దెబ్బతీసింది. రిచర్డ్ సన్ ఐదు, హ్యాస్టింగ్స్, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ నాథన్ లియోన్కు ఒక వికెట్ దక్కింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్  డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు.  భారత్ బౌలర్లలో ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, ధావన్, జడేజా చెరొక వికెట్లు తీసుకున్నారు. ఐదు వికెట్లు పడగొట్టిన రిచర్డ్ సన్ ను మ్యాచ్ అఫ్ ది మ్యాచ్ వరించింది. కాగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా అసీస్ ఉవ్విళ్లూరుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  indvsaus  cricket  Australia  Teamindia  ODI Series  

Other Articles