Virat Kohli fastest to reach 7000 runs

Virat kohli fastest to reach 7000 runs

Virat Kohli, fastest 7000, Virat Record, Kohli Record in ODI, Australia series

Virat Kohli on Sunday added another feather to his hat as he became the fastest man to score 7000 one-day international (ODI) runs and the fastest to reach 24 centuries in the format. Kohli reached the milestone during the course of India's third ODI against Australia at the Melbourne Cricket Ground on Sunday, where he converted his third consecutive fifty into first century of the five-match series.

విరాట్ కోహ్లీ రికార్డ్.. 7వేల రన్స్ పూర్తి

Posted: 01/17/2016 06:59 PM IST
Virat kohli fastest to reach 7000 runs

భారత్ ఆస్ట్రేలియా సిరీస్ లో టీమిండియా వరుస అజయాలతో సిరీస్ ను ఆస్ట్రేలియాకు సమర్పించేసింది. అయితే ఈ మ్యాచ్ లో మన బాలర్లు మంచి పర్ఫామెన్స్ నే కనబరిచినా కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ లు టీమిండియా ఓటమికి బాటలు వేశారు. అయితే మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మాన్ విరాట్ కొహ్లి 117 బంతుల్లో 117 పరుగులు చేసాడు. కొహ్లీ సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ బ్యాటింగ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. మెల్బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7,000 పరుగులు పూర్తి చేశాడు.

161 ఇన్నింగ్స్, 169 మ్యాచులలో కోహ్లీ ఈ రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ డివిల్లియర్స్ పేరిట ఉంది. ఇతను 166 ఇన్నింగ్సులలో 7,000 పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ ఇప్పుడు అతని కంటే ఐదు ఇన్నింగ్స్ ముందే ఆ రికార్డ్ చేరువయ్యాడు. మూడో వన్డేలో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ 7,000 పరుగుల మార్క్ చేరాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది.

వన్డేలలో ఫాస్టెస్ట్ 7,000 :
విరాట్ కోహ్లీ (భారత్) - 161 ఇన్నింగ్స్ (2016)
ఏబీ డివిల్లీయర్స్ (దక్షిణాఫ్రికా) - 166 ఇన్నింగ్స్ (2014)
సౌరవ్ గంగూలీ (భారత్) - 174 ఇన్నింగ్స్ (2001)
బ్రయాన్ లారా(వెస్టిండీస్) - 183 ఇన్నింగ్స్ (2001)
డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్) - 187 ఇన్నింగ్స్ (1991)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  fastest 7000  Virat Record  Kohli Record in ODI  Australia series  

Other Articles