With our bowling, even 300 is insufficient, says MS Dhoni

Dhoni says 330 is par for the course in odis

india vs australia, ind vs aus, india vs australia 2016, india australia 2016, ind vs aus, aus vs ind, australia india, ms dhoni, dhoni, mahendra singh dhoni, rohit sharma, rohit, india cricket team, cricket news, cricket

MS Dhoni also admitted that there aren’t enough options on the bench and called for the batsmen to put more runs on the board.

అసీస్ కు మరింత భారీ టార్గెట్ పెట్టాలన్న దోని

Posted: 01/17/2016 02:08 PM IST
Dhoni says 330 is par for the course in odis

టీమిండియా ముందున్నవి రెండే లక్ష్యాలని కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. బ్రిస్బేన్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థికి 300 పరుగుల లక్ష్యం సరిపోవడం లేదని చెప్పాడు. టీమిండియా ఆటతీరు నాసిరకంగా లేదని, 300 పరుగులు అంటే భారీ స్కోరు అన్న విషయం గుర్తించాలని ధోనీ చెప్పాడు. అయితే ప్రత్యర్థికి ఈ స్కోరు సరిపోవడం లేదని, మెల్ బోర్న్ లో జరగనున్న మూడో వన్డేలో 330 పైచిలుకు లక్ష్యం నిర్దేశించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

తమ ముందు ప్రత్యర్థిని కట్టడి చేయడం, లేదా భారీ లక్ష్యం నిర్దేశించడం అనే రెండు లక్ష్యాలు ఉన్నాయని, తొలిదాని కంటే రెండోదే చేయడానికి ప్రయత్నిస్తామని ధోనీ చెప్పాడు. తద్వారా బౌలర్ల నుంచి అద్భుతాలు ఆశించడం లేదని చెప్పకనే చెప్పాడు. రెండో వన్డేలో స్టేడియం అన్ని వైపుల నుంచి గాలి వీయడంతో ఇషాంత్ శర్మ స్వింగ్ రాబట్టలేకపోయాడని ధోనీ చెప్పాడు. కాగా, ఈ సిరీస్ లో రెండు వరుస పరాజయాలతో టీమిండియా వెనుకబడిన సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MSD  MS dhoni  team india  ind vs aus 2016  

Other Articles