Josh Hazlewood's bowls fastest delivery in Test match history at 164 kph

Hazlewood becomes fastest test bowler in cricket history

Hazlewoods fastest ball, Fastest ball, Fastest ball ever, Josh Hazlewoods fastest ball, Australia vs West Indies, Shoaib Akhtar, Fastest ball in cricket

Josh Hazlewood's bowls fastest delivery in Test match history at 164 kph, which took everybody by surprise.

ఆ స్పీడు అతనిది కాదు.. కొలమానం చేసిన 'మీటర్' మిస్టేక్

Posted: 12/30/2015 07:23 PM IST
Hazlewood becomes fastest test bowler in cricket history

అస్ట్రేలియా క్రికెటర్ రికార్డు సృష్టించాడు అనుకున్నారు అందరు. మహామహా క్రికెట్ దిగ్గజాలకే అర్థంకాక.. ఎలా సాద్యమైందని అందరు విస్మయానికి గురయ్యారు. రావల్పిండి ఎక్స్ ప్రెస్ కే షాక్ ఇఛ్చేలా ఆ వేగాన్ని అందుకోవడానికి అనితర సాధ్యం అనుకున్నారందరూ. అంతటి వాయువేగంతో వఛ్చిన బంతిని అందరూ వేనోళ్ల కీర్తంచేంత లోనె అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అదే జరగకపోయివుంటే.. ఇవాళ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డుకు కురార్పణ జరిగిన రోజుగా మారేంది. అప్పటికే పలువురు క్రికెటర్లు.. బౌలర్ కు కితాబిచ్చారు. ఆ తరువాత రంగంలోకి దిగిన అస్ట్రేలియా క్రికెట్ తప్పు జరిగిందని, అ స్పీడు బంతిని విసిరిన బౌలర్ ది కాదని, వేగాన్ని కొలిచిన ఎలక్ట్రానిక్ పరికరానిదంటూ నాలుక కరుచుకుంటూ అసలు విషయాన్ని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక వేగంగా బంతులు విసిరిన బౌలర్లు రికార్డును అస్ట్రేలియా క్రికెటర్ జోష్ హాజిల్ వుడ్ బద్దలు కోట్టాడని, అతడు ఏకంగా 164.2 కిలోమీటర్ల వేగంతో రమారమి 102 మైళ్ల వేగంతో బంతిని విసిరాడని తొలుత అందరూ సంబరపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అస్ట్రేలియా క్రికెట్ అది స్పీడో మీటర్ తప్పని తేల్చింది. హాజిల్ వుడ్ 135 కిలోమీటర్లకు కొంత అటుఇటుగా బంతిని విసిరే బౌలర్ ఒక్కసారిగా 164 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతో ఆశ్చర్యానికి గురైన క్రికెట్ అస్ట్రేలియా ఈ విషయాన్ని అలస్యంగా చెప్పింది. దీంతో తప్పును సరిదిద్దుకుని రికార్డు కాదని చరిత్ర పుటలను తిరగేయాల్సిన పని లేదని తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hazlewood  fastest ball  australia  speedometer  

Other Articles