Vijay Hazare Trophy: Parthiv scores superb ton, Delhi claim late wickets

Parthiv scores superb ton against delhi

Cricket, Gujarat, Rujul Bhatt, Parthiv Patel, Gautam Gambhir, Ishant Sharma, Navdeep Singh, Priyank Panchal, Vijay Hazare Trophy, Delhi, Nitish Rana, Axar Patel, Rush Kalaria, Manan Sharma, Pawan Negi, Manpreet Juneja

Parthiv Patel (105 off 119 balls) played a perfect captain's knock, scoring a well deserved century but just when he looked set for a big score,

శతకంతో రాణించిన గుజరాత్ కెప్టెన్ పార్థివ్

Posted: 12/28/2015 08:02 PM IST
Parthiv scores superb ton against delhi

ఉత్కంఠ భరితంగా సాగిన విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో ఢిల్లీపై గుజరాత్ జోరును కోనసాగించింది. గుజరాత్ జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇవాళ జరిగిన  తుదిపోరులో పార్థీవ్ పటేల్(105; 119 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది.  దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్  ఆదిలోనే  ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.
 
రుజుభట్, పార్థివ్ జోడి మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ,  పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో గుజరాత్ తడబడినట్లు కనిపించింది. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కాగా, చివర్లో కలారియా(21) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 273 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఢిల్లీ బౌలర్లలో సైనీ, నేగీ, భాటిలకు తలో రెండు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, రానా, మనన్ శర్మలకు ఒక్కో వికెట్ లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Rujul Bhatt  Parthiv Patel  delhi  vijay hazare trophy  

Other Articles