Gary Kirsten set for IPL return, in talks with Rajkot

Gary kirsten may return to ipl to coach rajkot

gary kirsten, gary kirsten coach, gary kirsten ipl, gary kirsten rajkot, gary kirsten delhi dare devils, indian premier league, ipl 9, ipl, cricket

The Rajkot team is keen to hire a coach who has the experience of coaching at the highest level.

రాజ్ కోట్ కోచ్ గా క్రిస్టన్ పునరాగమనం..?

Posted: 12/28/2015 07:21 PM IST
Gary kirsten may return to ipl to coach rajkot

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న.. టీమిండియా మాజీ క్రికెట్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పునరాగమనం చేస్తున్నారా..? అంటే అవుననే వార్తలే అందుతున్నాయి. ఐపీఎల్ లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండు రెండేళ్ల పాటు నిషేధానికి గురికావడంతో వాటి స్థానంలోకి ఇటీవలే ప్రవేశించిన నూతన జట్టు రాజ్ కోట్ గ్యారీ క్రిస్టన్ ను తమ జట్టుకు కోచ్ గా సేవలందించాలని కోరుతుందందని సమాచారం.

ఈ మేరకు కిర్‌స్టెన్‌ ను రాజ్ కోట్ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారాన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సివుంది. కాగా తమ ఆఫర్ ను క్రిస్టన్ రమారమి అంగీకరించారని ఆయన తమ జట్టుకు కోచ్ గా సేవలందిస్తారని రాజ్ కోట్ జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఆయనదే కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆయన తమకు సేవలందిస్తే తమ జట్టు విజయాల పరంపర కోనసాగుతుందని యాజమాన్యం భావిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gary Kirsten  IPL  Rajkot  

Other Articles