Rahane posts first century of India SA series

Unflashy rahane posts first century of india sa series

Ajinkya Rahane, india, south africa, indian team, Indian Cricket, Rahane performence, Ajinkya Rahane in south Africa

Ajinkya Rahane struck the first century of the low-scoring series to help India reach 326/8 at lunch on the second day of the fourth and final Test against South Africa at the Ferozeshah Kotla stadium on Friday. An industrious batsman often overshadowed by his flashier teammates, the 27-year-old right-hander fell after a cultured 127, crafted over five hours with the help of four sixes and 11 boundaries.

శతకంతో అదరగోట్టిన అజింక్య రహానే

Posted: 12/04/2015 06:02 PM IST
Unflashy rahane posts first century of india sa series

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ లో తొమ్మిది ఇన్నింగ్స్ ల తరువాత తొలిసారిగా శతకం నమోదైంది. న్యూఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు ఆటగాడు రహానే 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 231/7 వద్ద ఈ ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన జట్టులో రహానే, ఆశ్విన్ లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 180 బంతులాడిన రహానే 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

ఈ టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ లో జరిగిన నాలుగు ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఆపై రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్ తరువాత వరుణుడు అడ్డుకున్నాడు. ఇక మూడవ మ్యాచ్ 'లో స్కోరింగ్' మ్యాచ్ గా సాగి మూడు రోజుల్లోనే ముగిసింది. ఆఖరిదైన ఈ మ్యాచ్ లో 9 ఇన్నింగ్స్ ల తరువాత సెంచరీ నమోదైనట్లయింది. ప్రస్తుతం భారత స్కోరు 97 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు కాగా, రహానే 115, అశ్విన్ 21 పరుగులతో ఆడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles