Ex New Zealand Cricket All-Rounder Chris Cairns Cleared Of Perjury

Chris cairns cleared

Chris Cairns cleared, Brendon McCullum, Lalit Modi, Chris Cairns, Indian Premier League, New Zealand, cricket

New Zealand Cricket have promised to support Brendon McCullum after former Test all-rounder Chris Cairns was acquitted of perjury in London

కోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా బయటపడ్డ క్రిస్ కెయిన్స్

Posted: 12/01/2015 07:23 PM IST
Chris cairns cleared

గత ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని లండన్ కోర్టు తేల్చడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఊపిరి పీల్చుకుంది. ఆ కేసులో కెయిన్స్ నిర్దోషిగా తేలడంతో వాస్తవాలు ఏమిటో ప్రజలు తెలుసుకున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ స్టువర్ట్ హీల్ తెలిపారు. ఈ తీర్పు అనంతరం హీల్ న్యూజిలాండ్ రేడియోతో మాట్లాడుతూ..ఇది తమ క్రికెట్ కు చాలా ఆరోగ్యకరమైన తీర్పుగా పేర్కొన్నారు.

ఒకవేళ ఎటువంటి తీర్పు లేకుండా కేసు ముందుకు సాగితే మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ కు మరింత నష్టం జరిగే అవకాశం ఉండేదన్నారు. కెయిన్స్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న కాలం అంతా కూడా క్రికెట్ కుటుంబానికి దుర్దినాలుగా హీల్ అభిప్రాయపడ్డారు. 'ఇది ఒక కెయిన్స్ ఫ్యామిలీకే కాదు.. అందులో ఉన్న సాక్షులకూ కష్టకాలం. ఇందులో విజేతలు ఎవరూ లేరు' అని హీల్ తెలిపారు.

కెయిన్స్ ను నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించింది. కెయిన్స్‌తో పాటు అతని స్నేహితుడు ఫిచ్ హాలండ్‌ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని లలిత్ మోడీ 2010లో ట్వీట్ ద్వారా దుమారం రేపారు. దీనికి ఆగ్రహించిన కెయిన్స్ 2012లో కోర్టును ఆశ్రయించి రెండేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తరువాత రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు ఎటువంటి వివాదం లేకుండా ముగిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  Stuart Heal  chris crains  

Other Articles