pakistan former cricketer javed miandad makes controversial statements on india cricket team and bcci | pakistan controversies | india cricket team

Javed miandad controversial statement on india cricket team bcci

javed miandad news, javed miandad controversy, javed miandad press meet, team india, india cricket team, cricket india team, bcci controversy, bcci updates

javed miandad controversial statement on india cricket team bcci : pakistan former cricketer javed miandad makes controversial statements on india cricket team and bcci.

టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

Posted: 10/29/2015 04:05 PM IST
Javed miandad controversial statement on india cricket team bcci

పాకిస్తాన్ క్రికెట్ టీం మెంబర్లు టీమిండియాపై నిత్యం అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. తమ జట్టు ఓడిపోయినప్పుడు నోరు మెదపకుండా బిత్తెర మొహాలు పెట్టుకునే పాక్ క్రికెటర్లు.. టీమిండియా ఓడిపోయినప్పుడు మాత్రం తమ నోరుకు పనిచెబుతుంటారు. అంతేకాదు.. వారికి అదో పండుగ వాతావరణంలా ఫీల్ అయిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారు టీమిండియా ఘాటు వ్యాఖ్యలు చేయడం సరదా అయిపోయింది. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెట్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్య చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు.

టీమిండియాకు ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ కు భారత్ జట్టు వెనుకంట వేస్తోందంటూ మియాందాద్ వ్యాఖ్యానించాడు. ఈ కారణంగానే ఈ ఏడాది చివరిలో యూఏఈ వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ పై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోందని ఆయన పేర్కొన్నాడు. బీసీసీఐ వెనుకంజ నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయాలని అతడు సూచించాడు కూడా! అంతేకాదు.. టీమిండియా మునుపటిలా కాకుండా చాలా చెత్త టీంగా తయారైందని, ఆటగాళ్లు మైదానంలో ఆడేందుకు భయపడుతున్నారని, వరుస ఓటములతో తమ ప్రతిభను కోల్పోతున్నారంటూ అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు. ఈ భయంతోనే పాక్ తో ఆడేందుకు టీమిండియా భయపడుతోందంటూ ఆయన సంచలనం సృష్టించాడు.

ఇదిలావుండగా.. మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై పలు టీమిండియా క్రీడాప్రముఖులతో సహా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఇండియా-పాక్ ల మధ్య జరిగిన మ్యాచుల్లో భాగంగా పాక్ ఘోరంగా పరాజయం పాలైన సందర్భాల్ని గుర్తూ చేస్తూ.. అతని కామెంట్లకు తిరుగు సమాధానం చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : javed miandad  india cricket team  pakistan controversies  

Other Articles