former indian cricketer virender sehwag feeling bad on his retirement statement | sachin tendulkar

Virender sehwag feeling bad on his retirement statement

Virender Sehwag news, Virender Sehwag interview, Virender Sehwag controversy, Virender Sehwag retirement, sachin tendulkar, sachin tendulkar updates

Virender Sehwag feeling bad on his retirement statement : former indian cricketer veeredra sehwag feeling bad on his retirement statement.

‘తలరాత మరోలా’ వుందంటూ వీరూ ఆవేదన

Posted: 10/29/2015 12:42 PM IST
Virender sehwag feeling bad on his retirement statement

టీమిండియా డాషింగ్ బ్యాట్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో అడుగిడితే చాలు.. అభిమానులు ఈలలు, చప్పట్లతో ఆ ప్రదేశాన్ని ఊరేగింపులా చేసేవారు.. ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఇతని రాకతో కాస్త ఆందోళనకు గురయ్యేవారు. ముఖ్యంగా.. వీరూ ఎక్కడ తమ బౌలింగ్ లో వీరబాదుడు బాదుతాడేమోనన్న భయం బౌలర్లను వెంటాడేది. అటువంటి డేంజర్ క్రికెటర్ అయిన సెహ్వాగ్ తలరాత అంతలోనే మారిపోయింది. డ్యాషింగ్ స్థాయి నుంచి పూర్తిగా డౌన్ అయిపోయాడు. తిరిగి తన ప్రతిభను పుంజుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. దీంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన సెహ్వాగ్.. చివరికి రిటైర్ మెంట్ ప్రకటించేశాడు. కానీ.. తాను రిటైర్ మెంట్ ప్రకటించిన విధానం తనని తీవ్రంగా కలచివేసిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నిజానికి.. ప్రతి క్రికెటర్ తాను ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదేనని ముందుకు నిర్ణయించుకుని రిటైర్ మెంట్ ప్రకటిస్తారు. కానీ.. వీరూ విషయంలో అలా జరగలేదు. తనని టీమ్ నుంచి తీసేసినప్పటికీ.. తిరిగి అవకాశం లభిస్తుందని ఎంతో ఆశించాడు. అప్పుడు మ్యాచ్ సందర్భంగా తన రిటైర్ మెంట్ ప్రకటించి, ఎంతో ఆర్భాటంగా చివరి మ్యాచ్ ఆడాలని అనుకున్నాడు. అయితే.. వీరూ అనుకున్నట్లు జరగకపోగా.. టీమిండియాలో స్థానం లేని సమయంలోనే తీవ్ర మనోవేదనతో రిటైర్ మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. తనకింక జట్టులో స్థానం దక్కే అవకాశం లేదని తెలుసుకున్న వీరూ.. చివరికి రిటైర్ మెంట్ ప్రకటించడమే శరణ్యమని భావించి అలాగే చేశాడు. అదే తనని తీవ్రంగా కలచివేసిందని బాధపడుతున్నాడు ఈ మాజీ క్రికెటర్. తాను ఓ మ్యాచ్ ఆడుతూ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించేందుకు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

తానూ అందరి క్రికెటర్స్ లాగే చివరి మ్యాచ్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పి వుండేవాడినని, వీడ్కోలు సమయంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడి వుండేవాడినని అన్నాడు. కానీ.. తన తలరాత మరోలా వుందని మనస్తాపాన్ని వ్యక్తం చేశాడు. 2007లోనే జట్టు నుంచి స్థానం కోల్పోయినప్పుడు ఇక ఆడకూడదని భావించానని, కానీ సచిన్ ఒత్తిడి మేరకే అప్పట్లో రిటైర్ మెంట్ ప్రకటించలేదని అన్నాడు. ఆ సమయంలో తనను ఇక ఎంపిక చేసే ఉద్దేశం లేదని సెలక్టర్లు చెప్పివుంటే.. ఆ సిరీస్ నే తన ఆఖరి సిరీస్ అని చెప్పి.. ఆట నుంచి విరమణ ప్రకటించి వుండేవాడినంటూ వీరూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఏదేమైనా.. తాను రిటైర్ మెంట్ చేసిన విధానం తనను చాలా బాధించిందని ఆవేదనతో తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  Sachin Tendulkar  

Other Articles