అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన డేరింగ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు... క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్-షేన్ వార్న్ తమ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ‘క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్' టీ20 లీగ్ లో అగేందుకు రెడ్ కార్పెట్ ( ఎర్ర తివాచీని) పరిచారు. ఈ టార్నమెంటులో ఆడేందుకు సెహ్వాగ్ కూడా వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో ఒకనాటి భారత ఇన్నింగ్స్ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ అదే జోడీగా ఏర్పడి ఓపెనర్లుగా అభిమానులకు కనువించు దేసే అవకాశం వుంది. అమెరికాలో వచ్చే నెలలో ఈ సిరీస్ ఫ్రారంభం కానుంది.
గత వారం రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ సహా అన్ని పార్మెట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికిన వీరు..అక్టోబర్ 27న సెహ్వాగ్.. ఆల్ స్టార్స్ సిరీస్‌లో ప్రవేశించాడని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. గతంలో అనేక అంతర్జాతీయ మ్యాచుల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఈ ద్వయం మళ్లీ ఈ టోర్నీ ద్వారా ఓపెనర్లుగా మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా సచిన్ చేసిన ట్విట్ అందరినీ అకర్షిస్తుంది. ‘నా స్నేహితుడా..నీకు ఆల్ స్టార్స్ సిరీస్‌లోకి ఘన స్వాగతం' అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు.
షేన్ వార్న్ కూడా సెహ్వాగ్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశాడు. న్యూయార్క్‌లో కలుసుకుందామని పేర్కొన్నాడు.అమెరికాలో ఈ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచులు జరగనున్నాయి. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు తలపడతాయి. నవంబర్ 7న న్యూయార్క్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారా, జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ముత్తయ్య మురళీ ధరన్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి మాజీ దిగ్గజ ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more