Cricketer Amit Mishra arrested, given bail

Amit mishra arrested in sexual assault case given bail

amit mishra, cricketer, sexually assault, leg spinner, amit mishra booked, amit mishra case, amit mishra news, bengaluru, Bengaluru police registered fir against amit mishra, criminal case against Amit Mishra, amit mishra sexual assault case, amit mishra assault case, amit mishra assaulting female friend, amit mishr five star assault case

The Bengaluru police on Tuesday arrested and then released Indian spinner Amit Mishra. He was arrested in connection with the attack on a woman.

టీమిండియా క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టు.. విడుదల

Posted: 10/27/2015 06:55 PM IST
Amit mishra arrested in sexual assault case given bail

టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను లైంగిక వేధింపుల కేసులో బెంగుళూరు పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. సుమారు మూడు గంటల పాటు ఆయనను పలు అంశాలపై ప్రశ్నించారు. మూడు గంటల విచారించిన తరువాత అయనను బెయిలుపై విడుదల చేశారు.. అమిత్ మిశ్రా తనను లైంగికంగా వేధించినట్లు అతనికి పరిచయమున్న ఓ మహిళ అరోపించడంతో కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు ఈ నెల 20వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఈ కేసుకు సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పోలీసులు అమిత్ మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పంపించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బీసీసీఐ.. బౌలర్ మిశ్రాపై విచారణకు ఆదేశిస్తూ అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు గంటల పాటు విచారించిన తరువాత బెయిల్ పై విడుదల చేశారు. అమిత్ మిశ్రాపై బెంగళూరు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Mishra  Sandeep Pati  sexual assault  bengaluru  female friend  

Other Articles