ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తర్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పోటీలు హిట్ అవుతాయా! లేక అరంభ శూరత్వంగానే మిగిలిపోతాయా అన్నది ఆసియాలోని క్రికెట్ అభిమానులందరిలో రేకెత్తుతున్న సందేహం. ఐపీఎల్ లో పాకిస్థాన్ కు చెందిన క్రికెటర్లకు నో ఎంట్రీ అంటూ బిసిసిఐ అంక్షలు విధించిన నేపథ్యంలో ఇలాంటి ఫోట్టి పార్మెట్ టోర్నీని నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలపించింది. క్రికెట్ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్లోనే.
ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్న ఇస్లామిక్ దేశాల్లోనూ క్రికెట్కు మంచి ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే అభిమానులకు మజాను అందించడంతోపాటు కాస్తంత సొమ్ము కూడా చేసుకుందామనే భావనతో పొట్టి క్రికెట్ పోటీలను తెరపైకి తెచ్చింది పీసీబీ. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ వీరి నియామకాలను ఖరారుచేశారు. దీంతో వసీం, రమీజ్లు ఐపీఎల్కు దూరం కానున్నారనే వార్తలూ వినవస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్గా వసీం అక్రం.. వ్యాఖ్యత, విశ్లేషకుడిగా రమీజ్లు ఐపీఎల్లో తమ వంతు పాత్ర పోషించారు. అయితే భారత్ తరహాలో క్రీకెటర్లకు పిసిబి వేలం ద్వారా లక్షలాధి రూపాయలను అందించగలదా..? ఇక పాకిస్థాన్ నిర్వహించే సూపర్ లీగ్ కు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్రీడాకారులు వస్తారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. క్రీడా అభిమానుల ఉత్కంఠ నేపథ్యంలో స్పష్టత కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more