Yuvraj Singh Dating With Bodyguard Actress Hazel Keech | Bollywood Love Affairs

Yuvraj singh hazel keech love affair bodyguard actress

yuvraj singh love affair, yuvraj singh hazel keech, hazel keech love affair, yuvraj dating hazel, yuvraj singh controversy, hazel keech controversies, hazel keech scandals, yuvraj singh love matters

Yuvraj Singh Hazel Keech Love Affair Bodyguard Actress : Yuvraj Singh, India's 2011 World Cup hero, is reportedly dating British model-actress Hazel Keech. The two were reportedly seen holidaying in London together.

సల్మాన్ భార్యతో యువీ ప్రేమాయణం

Posted: 09/07/2015 05:31 PM IST
Yuvraj singh hazel keech love affair bodyguard actress

బాలీవుడ్ తరహాలోనే క్రీడారంగం కూడా ‘ప్రేమ’ మాయలో మునిగితేలుతున్నట్లు కనిపిస్తోంది. విరాట్ కోహ్లీతోపాటు మరికొందరు క్రీడాకారులు తమ ప్రేమవ్యవహారాల విషయమై నిత్యం వార్తల్లో నిలుస్తుండగా.. తాజాగా యువరాజ్ సింగ్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. నిన్నటివరకు జట్టులో స్థానం దక్కించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడిన యువీ.. ఇప్పుడు ఓ అమ్మాయి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయినట్లు సమాచారం. ఆ అమ్మాయి మరెవ్వరో కాదు.. సల్మాన్ ఖాన్ ‘బాడీగార్డ్’ సినిమాలో అతని భార్యగా నటించిన హాజెల్ కీచ్. ఇప్పటికే వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మీడియా కోడై కూస్తోంది. ఓ సందర్భంలో వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో.. వీరి ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది.

యువరాజ్ సింగ్ ఇదివరకే కిమ్ శర్మ, దీపికా పదుకునే లాంటి తారలతో ప్రేమాయణం నడిపినట్లు ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ముఖ్యంగా దీపికాతో ఇతని లవ్ ఎఫైర్ తారాస్థాయికి చేరిందని, పెళ్లి కూడా చేసుకుంటారని ఊహాగానాలు తెగ చక్కర్లు కొట్టాయి కూడా! అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ ఎవరి పనుల్లో వారి బిజీ కావడం, ఆ తర్వాత దీపికా రణ్వీర్ ప్రేమలో మునిగిపోవడం అంతా జరిగిపోయింది. అటు యువీ కూడా మళ్లీ ప్రేమ జోలికి వెళ్లకుండా జట్టులో స్థానం సంపాదించుకునేందుకు చాలా కసరత్తు పడ్డాడు కూడా. కానీ.. ఫలితం లేకపోవడంతో ఇతని దృష్టి హాజెల్ వైపు మరలినట్టు కనిపిస్తోంది. బ్రిటీష్ మోడల్ అయిన హాజెల్.. రెండు మూడు చిత్రాల్లో నటించింది కూడా. 2011లో వచ్చిన ‘బాడీగార్డ్’, 2012లో వచ్చిన ‘మాగ్జిమమ్’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. ఈ ఖాళీ సమయం నేపథ్యంలోనే వీరు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ జంట హాలీడే ట్రిప్ కి కూడా వెళ్లినట్లు ప్రచారం కొనసాగుతోంది. లండన్ లో ఈ ప్రేమపావురాలు ఎంజాయ్ చేశాయని కథనాల మీద కథనాలు వస్తున్నాయి. ట్రిప్ అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా వీరిద్దరూ ఎయిర్ పోర్టు వద్ద దర్శనం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రేమాయణాన్ని నడుపుతున్న ఈ జంట.. పెళ్లి చేసుకుంటారో? లేదో? చివరికి వీరి వ్యవహారం ఎంత దూరం వరకు వెళుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : yuvraj singh love affairs  hazel keech affair  bollywood affairs  

Other Articles