Virat Kohli will help India better overseas record: Adam Gilchrist

Gilchrist sees clarke in kohli s captaincy

Virat Kohli, Steve Smith, Gilchrist sees Clarke in Kohli's captaincy, Michael Clarke, BCCI, Adam Gilchrist, Adam Gilchrist on virat kohli, Australia,Sri Lanka,India,Adam Gilchrist,Sri Lanka vs India 2015,Cricket Risk-Taker Virat Kohli,atest Sri Lanka vs India 2015 news India vs Sri Lanka, Latest cricket news

It is not often that you see India winning a Test overseas but Virat Kohli's penchant for taking calculated risks could buck that trend, feels Australian great Adam Gilchrist.

దూకుడులో మైఖిల్ క్లార్క్ లా కనబడుతున్న కోహ్లీ..

Posted: 08/26/2015 06:10 PM IST
Gilchrist sees clarke in kohli s captaincy

శ్రీలంక పైన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు భారీ విజయం సాధించిన నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన దూకుడైన సారథ్యంతో జట్టు ఓవర్ సీస్ రికార్డును మెరుగుపరచగలడని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉన్నా, విదేశాల్లో తమ స్థాయి ప్రదర్శనలు చేయలేక ఇటీవల కాలంలో ఎన్నో ఓటములు ఎదుర్కొన్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కోహ్లీపై గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ సహజసిద్ధ దూకుడు జట్టును మరోస్థాయికి తీసుకెళ్తుందని గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ సాహస నిర్ణయాలకు సిద్ధంగా ఉంటాడన్నాడు. వ్యక్తిగత ఆటలోనూ అతను అదే దూకుడును ప్రదర్శిస్తాడని కొనియాడారు. తమ జట్టు కెప్టెన్ మైఖిల్ క్లార్క్ లాగానే రిస్క్ తీసుకోవడంతో కోహ్లీ ముందుటాడని అన్నాడు. క్లార్క్ కూడా దూకుడుగా ఉంటాడని చెప్పాడు. అది జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ పిచ్‌ల పైన తడబడుతున్న భారత్‌ను కోహ్లీ గాడిలో పెట్టగలడన్నాడు. కాలం గడుస్తున్నా కొద్దీ అతను తనకంటూ ఓ శైలిని సృష్టించుకుంటాడు అని చెప్పాడు. గెలుస్తామనే ఆశ ఉంటే ఓటమి ప్రమాదం ఉన్నా క్లార్క్ సాహసం చేస్తాడని, క్లార్క్‌తో కోహ్లీకి సారూప్యం ఉందన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Steve Smith  Michael Clarke  BCCI  Adam Gilchrist  

Other Articles