venkatapati raju comes in support of harbhajan

Harbhajan is trying too hard to prove a point raju

Cricket, Harbhajan Singh, Venkatapathi Raju, Mohammad Azharuddin, India vs Sri Lanka series, latest cricket news, sports news, Bhajji news, spinners, Rangana Herath

former India tweaker Venkatapathi Raju feels the veteran off-spinner's poor form is the result of trying "too hard" to prove his worth on comeback.

సత్తా చాటేందుకు హర్భజన్ అధికంగా శ్రమిస్తున్నాడు

Posted: 08/18/2015 06:46 PM IST
Harbhajan is trying too hard to prove a point raju

టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ తన సత్తాను చాటేందుకు అధికంగా శ్రమిస్తున్నాడని వెటరన్ హైదరాబాదీ స్పిన్నర్, టీమిండియా మాజీ అటగాడు వెంకటపతిరాజు అన్నాడు. స్పిన్ ఆధారంగా జరిగిన మ్యాచ్ లో హర్బజన్ తనను తాను నిరూపించుకునేందుకు అతిగా శ్రమించడమే ఫలితాలను రాబట్టలేకపోతోందన్నాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన టెస్టు యావత్తు స్పిన్ డామినేషన్ లోనే జరిగినా.. హర్భజన్ అతి శ్రమ ఫలితం ఆయనకు విక్కెట్లను దక్కించలేదని వ్యాఖ్యానించాడు.

తొలి టెస్టులో 25 ఓవర్లు వేసిన బజ్జీ కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే సాధించడం ఆయన స్థాయి కాదని అన్నారు. అనుభవపూర్వకంగా ఆయన ఎలాంటి తప్పులు చేయడం లేదని, అయినా ఆయనకు ఫలితాలు దక్కకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆయనకు ఎలాంటి సందర్భాలలో ఎలాంటి బంతులు విసరాలన్న విషయం బాగా తెలుసున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఎంతగా శ్రమించినా.. ఫలితాలు రావని అయినా నిరుత్సహాం చెందవద్దని వెంకటపతి రాజు సూచించారు.

కాగా తొలిటెస్టులో విజయం ముంగిట నిలిచిన టీమిండియా.. దానిని చేజేతులా జారవిడుచుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో మ్యాచ్ లోకి వెళ్లడంపై స్పందించిన ఆయన ముగ్గురు స్పిన్నరతో మ్యాచ్ జరిగే క్రమంలో విరేందర్ సేహ్వాగ్ లాంటి బ్యాట్స్ మెన్లు అవసరం జట్టుకు ఎంతైనా వుందన్నారు. వీరూ ప్రతీ మ్యాచ్ లో తన పరుగులతో స్కోరుబోర్డును పరుగులెత్తించేవారని ఆలాంటి బ్యాట్ మెన్లు లేకపోవడమే జట్టు పరాజయం పాలైందని ఆయన అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Harbhajan Singh  Venkatapathi Raju  India vs Sri Lanka series  

Other Articles