enforcement directorate asks cbi for red corner notice against lalit modi

Ed seeks interpol notice against lalit modi

Enforcement Directorate, Lalit Modi, Sushma Swaraj, Vasundhara Raje, ED, CBI, Central Bureau of Investigation, Red corner notice, tainted cricket czar Lalit Modi, money laundering case

The Enforcement Directorate on Tuesday asked the Central Bureau of Investigation to issue a Red Corner notice against tainted cricket czar Lalit Modi, who is accused of violating foreign exchange rules and other income tax offences.The Enforcement Directorate on Tuesday asked the Central Bureau of Investigation to issue a Red Corner notice against tainted cricket czar Lalit Modi, who is accused of violating foreign exchange rules and other income tax offenses.

లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటసుకు ఈడీ ప్రయత్నాలు

Posted: 08/11/2015 06:31 PM IST
Ed seeks interpol notice against lalit modi

మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న మోదీని భారత్ రప్పించే ప్రయత్నాలను ఈడీ వేగవంతం చేసింది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఈడీ.. సీబీఐని కోరింది. ఈ విషయంపై సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించనుంది. త్వరలో మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఇటీవల ప్రత్యేక పీఎమ్ఎల్ఏ కోర్టు మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడి, నిధులను అక్రమంగా మళ్లించిన కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న మోడీకి.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేలు సహకరించారని వారిన తక్షణ పదవుల నుంచి తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన వర్షాకాల సమావేశాలను కూడా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. దీంతో లలిత్ మోడీపై చర్యలను ఈడీ వేగవంతం చేసింది. ఐపీఎల్ నుంచి బహిష్కరణ తరువాత 2010లో మోదీ లండన్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్కు తిరిగి రాని మోదీ ఈడీ విచారణకు సహకరించడం లేదు. ఈడీ నోటీసులపై స్పందించిన ఆయన భారత్ కు వస్తే తన ప్రాణాలను హానీ వుందని చెబుతూ కాలయాపన చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  enforcement directorate (ED)  CBI  Red corner notice  

Other Articles