India in Sri Lanka: Under Kohli, India stand on the cusp of a brave new dawn

Virat kohli looks to impress in first full series

Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India

India playing Sri Lanka has evoked yawns rather than yelps of glee. At the end of the last decade, it felt like the two teams played each other every other weekend.

శ్రీలంకతో పోరుకు సిద్దంగా వున్నాం

Posted: 08/11/2015 06:33 PM IST
Virat kohli looks to impress in first full series

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు సిద్ధంగా ఉందని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం గాలేలో జరగనుంది. ఈ సందర్భంగా మీడియా సవావేశంలో కోహ్లీ మాట్టాడారు. లంకతో పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, టెస్టు క్రికెట్‌లో సత్తా చాటడానికి యువ క్రికెటర్లకు ఈ సిరీస్ సదవకాశమని కోహ్లీ అభిప్రాయపడ్డారు. బుధవారం జరగబోయే మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.

కాగా, శ్రీలంకతో భారత్ టెస్ట్‌ సిరీస్ నెగ్గి రెండు దశాబ్దాలు కావస్తున్న తరుణంలో ఈ సిరీస్‌ను ఎలాగైనా నెగ్గాలన్న కసితో కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెప్టెన్‌గా కోహ్లీకి ఈ సిరీస్ పూర్తిస్థాయిది కావడంతో ఈ సిరీస్‌ని గెలిచి తన నాయకత్వ స్థానానికి సుస్థిర బాటలు వేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక పూర్తిస్థాయి సిరీస్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సమావేశంలో హుందాగా మాట్లాడారు. కోహ్లీ స్టైల్ మీడియాతో పాటు విశ్లేషకులను కూడా సంతృప్తిని కలిగించింది. అయితే సీరిస్ గెలవాలన్న కోహ్లీ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  srilanka  India  ind vs srl  India vs srilanka  ind vs sri 2015  

Other Articles