India vs Sri Lanka President XI, Rahane nears ton, India 279/6

India vs sri lanka president xi live cricket score india tour of sri lanka 2015 rahane ton saves india

india,india tour of sri lanka 2015,india vs sri lanka,india vs sri lanka 2015,sri lanka,sri lanka vs india,sri lanka vs india 2015,India vs Sri Lanka President XI, Live Cricket Score, India tour of Sri Lanka 2015, Rahane nears ton

first day of the three-day tour game between India and Sri Lanka from August 6 at R Premadasa Stadium, Colombo on Thursday

రహానే శతకంతో రాణిస్తున్న టీమిండియా..

Posted: 08/06/2015 07:33 PM IST
India vs sri lanka president xi live cricket score india tour of sri lanka 2015 rahane ton saves india

మూడు టెస్టుల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వచ్చిన టీమిండియా.. ఇవాళ లంక ప్రెసిడెంట్స్‌ బోర్డు ఎలెవన్ తో జరుగుతున్న మూడు రోజుల వార్మ్ అప్ మ్యాచ్‌ లో ఆరు విక్కెట్ల నష్టానికి 314 పరుగులు సాధించింది. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ఇది తొలి పూర్తిస్థాయి సిరీస్‌. అయినా.. ఆయన ఆట తీరు మాత్రం ఆకట్టుకోలేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేయాలని భావిస్తున్న టీమిండియా జట్టుకు కొందరు సీనియర్ ప్లేయర్లు భారంగా మారారు. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పయిన రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీకి పేలవమైన ఆటతీరును కనబర్చారు.

శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న వామప్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక కట్టుదిట్టమైన బంతులను విసరుతూ టీమీండియా స్కోరుబోర్డును పరుగెత్తించకుండా నియంత్రిస్తున్నారు. వామప్ మ్యాచ్ లో టీమిండియా తరపున ఓపెనర్లుగా దిగన శిఖర్ ధావన్, కె లోకేష్ రాహుల్ లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. 108 పరుగుల భాగస్వామ్యాని వారు నెలకోల్పారు. 111 వ ఓవర్లో రాహుల్ షీహన్ జయసూర్య విసిరిన బంతిని తిరుమన్నేకు క్యాచ్ ఇచ్చిన రాహుల్ 92 బంతులను ఎదుర్కోని 44 పరుగులు చేశారు. ఆ తరువాత భారత్ వెనువెంటనే విక్కెట్లను కోల్పయింది. లంచ్ విరామం తరువాత వరుసగా నాలుగు వికెట్లను కోల్పయిన ఇండియా కష్టాల్లో పడగా, అజింక్యా రహానే, ఛత్తీశ్వర్ పూజరాలు ఆదుకుని స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

రోహిత్ శర్మ పద్నాలుగు బందులను ఎదుర్కోని ఏడు పరుగులు చేసి వెనుదిరగాడు.  ఆ వెంటనే వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తొమ్మిది బంతులు ఎదుర్కోని ఎనమిది పరుగులకు వెనుదిరిగాడు. ఈ తరువాత నాలుగో వికెట్ రూపంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 40 వ ఓవర్ లో వెనుదిరిగాడు. 106 బంతులను ఎదుర్కోన్న శిఖర్ ధావన్ అర్థసెంచరీ సాధించి 63 పరుగుల వద్ద రజితా బౌలింగ్ లో పెరిరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బ్యాటింగ్ లోకి దిగిన చత్తీశ్వర్ పూజరా రహానేకు తోడుగా నిలచి.. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. దీంతో భారత్ ఆరు విక్కెట్ల నష్టానికి 314 పరుగులు సాధించింది. కాగా అజింక్యా రహానే శతకంతో మెరిశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles