యాషస్ సిరీస్ మూడో టెస్టులో సత్తా చాటిన ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్.. ఇవాళ ప్రారంభమైన నాల్గవ టెస్టు తొలిరోజున అసీస్ జట్టులో ప్రకంపనలు సృష్టించాడు. తన కెరీర్ లో అత్యుత్తమ టెస్టు బెస్టు ఫిగర్ లను.. అసీస్ వంటి ధీటైన జట్టుపై రాబట్టి ప్రత్యర్థి ఆటగాళ్లకు వెన్నలో వణుకు పుట్టించాడు. అసీస్ పై నాలుగో టెస్టులో కేవలం 15 పరుగులు ఇచ్చి 8 విక్కెట్లను సాధించాడు ఈ ఇరవై తొమ్మిదేళ్ల సీమర్. స్వదేశం ఇంగ్లాండ్ లోని ట్రెంట్ బ్రిడ్జిలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్రాడ్ తన కెరీర్ లో మరో మైలు రాయిని చేరాడు.
ఇవాళ తొలి విక్కెట్ సాధించడంతోనే బ్రాడ్ మూడు వందల మైలు రాయిని చేరుకున్నాడు. తాజాగా అసీస్ పై ఏనమిది వికెట్లతో ఆకట్టుకున్న బ్రాడ్ మూడొందల వికెట్ల క్లబ్ లో చేరాడు. జట్టు తరుపున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు సాధించాడు. తన కెరీర్ లో 83 వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నబ్రాడ్ 307 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తరపున గతంతో ఫ్రెడ్ ట్రూమాన్, బాబ్ విల్లీస్, సర్ లాన్ బోతమ్, జేమ్స్ అండర్ సన్ లు సాధించాడు. వీరి తరువాత ఈ ఘనత సాధించింది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more