Virat Kohli Says He Has New Plans On Sri Lanka Test Series | Mahendra Singh Dhoni | India Team Captaincy Controversy

Virat kohli new plans sri lanka test series mahendra singh dhoni captaincy controversy

Virat Kohli, Sri Lanka, Virat Kohli Latest News, Virat Kohli Updates, Virat Kohli Galleries, Virat Kohli Controversy, Mahendra Singh Dhoni, Kohli Dhoni COntroversy, Sri Lanka Test Series, India Sri Lanka Series

Virat Kohli New Plans Sri Lanka Test Series Mahendra Singh Dhoni Captaincy Controversy : India Test Team Captain Virat Kohli Says That He Has New Plans On Sri Lanka Test Series To Win.

విరాట్ కోహ్లీ సరికొత్త వ్యూహాలు..

Posted: 08/03/2015 12:26 PM IST
Virat kohli new plans sri lanka test series mahendra singh dhoni captaincy controversy

టీమిండియా జట్టులో నాయకత్వ విభేదాలు వున్నాయని గతకొన్నాళ్ల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్ లో ఇండియా ఘోరంగా పరాజయం అయిన నేపథ్యంలో ఆ విభేదాల వార్తలు మరింత బలం చేకూరాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే.. జట్టులో ఎటువంటి విభేదాలు లేవంటూ ఆ తర్వాత వార్తలొచ్చినా.. ఇప్పటికీ అనుమానాలు చక్కర్లు కొడుతూనే వున్నాయి. మరోవైపు.. విరాట్ కోహ్లీ తనను తాను బెస్ట్ కెప్టెన్ గా అనిపించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఇప్పుడు అతనికి అటువంటి అవకాశం రావడంతో సరికొత్త వ్యూహాలు పన్నుతున్నాడు.

గతంలో ధోని గైర్హాజరులో తొలి రెండు టెస్టులు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ.. ఇప్పుడు తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్ (3 టెస్టులు)కు అతను నాయకత్వం వహించబోతున్నాడు. శ్రీలంక జట్టుతో టీమిండియా టెస్ట్ సిరీస్ పోరుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కి కోహ్లీయే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు.  అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్ తనకో సవాల్‌లాంటిదని, తన సామర్థ్యానికి పరీక్ష అని అతగాడు భావిస్తున్నాడు. ఆదివారం భారత టెస్టు జట్టు శ్రీలంకకు బయల్దేరడానికి ముందు అతను మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే అతగాడు ఈ టెస్టుపై తాను ఏర్పరచుకున్న సరికొత్త వ్యూహాలు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కి సంబంధించి తన మదిలో రకరకాల వ్యూహాలున్నాయని, ఒకటి విఫలమైతే మరొకటి సిద్ధంగా వుందని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా ఈ సిరీస్ పట్ల నేను చాలా ఉత్కంఠగా ఉన్నాను. గతంలో నేను ఏర్పరుచుకున్న అనేక ప్రణాళికలకు పూర్తి సిరీస్‌లో అమలు చేసే అవకాశం లభించింది. ఒక టెస్టులో ఐదు రోజుల్లో మన వ్యూహాలన్నీ వాడలేం. కాబట్టి గత మూడు టెస్టులను బట్టి నా కెప్టెన్సీని అంచనా వేయవద్దు. నన్ను నేను నిరూపించుకునేందుకు ఇది నాకు మంచి అవకాశం’ అని అన్నాడు. ఈ సిరీస్‌కు సంబంధించి తన మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయని, ఏదైనా ఒక వ్యూహం విఫలమైతే ప్రత్యామ్నాయంగా ప్లాన్ ‘బి’ సిద్ధంగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్ల వ్యూహమే సరైనదని, దానికే కట్టుబడి ఉంటానని అన్నాడు. ఈ విషయంలో తన బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా నిలుస్తానన్నాడు.

ఇక బ్యాటింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో 40కు పైగా సగటు ఉన్న అశ్విన్‌ను టెస్టు ఆల్‌రౌండర్‌గా తాను పరిగణిస్తానన్నాడు. ఇదే జాబితాలో హర్భజన్, భువనేశ్వర్‌లను కూడా చేర్చాడు. మురళీ విజయ్ ఫిట్‌నెస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని, తొలి టెస్టులోగా అతను సిద్ధమవుతాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. రెండో ఓపెనర్‌గా రాహుల్, ధావన్ మధ్య పోటీ నెలకొనడంతో ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పాడు. ‘అందరూ ఫామ్‌లో ఉండటం అనేది సమస్యే కాదు. వీరిద్దరు బాగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామమే. తుది జట్టులో ఎవరనేది తర్వాత తేలుతుంది’ అని విశ్లేషించాడు. రోహిత్ శర్మ టెస్టు ప్రదర్శన ఇటీవల గొప్పగా లేకపోయినా...అతను ప్రతిభావంతుడని, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా బంగ్లాతో వన్డే సిరీస్ పరాజయంపై కోహ్లీ తాను చేసిన వ్యాఖ్యల గురించి వివరించాడు. ఆనాడు తాను చేసిన ‘మేం ప్రణాళికలను సమర్థంగా అమలు చేయలేకపోయామని’ అనే వ్యాఖ్యను తప్పుగా అన్వయించారని వివరణ ఇచ్చాడు. అది ధోనికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యగా అప్పుడు వార్తల్లో నిలిచింది. ‘మేం అంటే అందులో నేను కూడా భాగమేనని అర్థం. అంటే నా తప్పు కూడా ఉందనే కదా. కానీ దానిని వక్రీకరించారు. జట్టులో ఎలాంటి విభేదాలూ లేవు’ అని విరాట్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Sri Lanka Test Series  India Cricket Team  

Other Articles