రొటీన్ కి భిన్నంగా ఏదైనా కొత్తగా చేస్తే దాని మజాయే వేరుగా వుంటుందని కొందరు వ్యక్తులు చెబుతుంటారు. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ విధానాన్ని నిత్యం పాటిస్తూ వుంటాడు. కేవలం క్రికెటర్ గానే కాకుండా ఇతర రంగాలలోనూ పాలుపంచుకుంటుంటాడు. ఇతరుల కంటే ఒక మెట్టు ఎత్తులో వుండాలని ఆశిస్తుంటాడు. అయితే.. అందుకోసం మనోడు ఏ తొందరపాటు వ్యవహారాలు నిర్వహించడు. ఆ సమయం వచ్చినప్పుడు అది తనకు అనుకూలంగా వుంటుందో లేదో విశ్లేషించి, అప్పుడు అడుగు పెడతాడు. అటువంటి అవకాశం మరొకటి ఇతని గుమ్మంలో వచ్చిపడింది. దానికోసమే ధోనీ సరికొత్త వ్యూహం రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నైతోపాటు రాజస్థాన్ జట్లపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే! దీంతో వచ్చే సీజన్ లో ధోనీ ఆడే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఆటకు దూరంగా వుండటమే ఇష్టపడని ధోనీ.. తన జట్టు ఇలా నిషేధింపబడటంపై చాలా నిరాశలో మునిగిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది. అదేమిటంటే.. బీసీసీఐ ఇచ్చిన నివేదికలో ‘యాజమాన్యాలు మారితే.. ఆ రెండు జట్లను ఐపీఎల్ లో కొనసాగించవచ్చు’ అని జస్టిస్ లోధా పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ధోనీ మెదడులో ఒక బల్పు వెలిగింది. వచ్చే సీజన్ ఎలాగైనా ఆడాల్సిందేనని దాదాపుగా నిర్ణయించుకున్న ధోనీ.. ఆ దిశగా తనదైన శైలిలో ప్రణాళికలు చేపడుతున్నాడు.
ధోనీ ఆలోచన ఏమిటంటే.. నిన్నటిదాకా తన కెప్టెన్సీలో ఆడిన చెన్నై జట్టును ఏకంగా కొనుగోలు చేయాలని అతడు తలపోస్తున్నాడట. జస్టిస్ లోధా ఇచ్చిన సింగిల్ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం.. తన నాయకత్వంలో జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించే అవకాశం మనోడి చేతికి దొరికినట్లే!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more