Team India Squad for Sri Lanka 2015: Amit Mishra included; Ravindra Jadeja ignored

India test squad announced for sri lanka series

team india, sandeep patil, selection commitee, indian Test squad, srilanka tour, amit mishra, vruddiman saha, harbajan singh, virat kohli, umesh yadav, IND vs SL, India, India vs Sri Lanka 2015, Sri Lanka, india sri lanka tour, india tour of sri lanka, india sri lanka squad, ind vs sl, sl vs ind, ind sl, sl ind, amit mishra, india team for sri lanka, india sri lanka team, cricket news, cricket

Virat Kohli will lead the 15-member Indian squad in Sri Lanka for the three-Test series. There were no major surprises in the squad announced by the selectors in New Delhi on Thursday.

శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భజ్జి, మిశ్రా, జెడేజాకు రిక్తహస్తం

Posted: 07/23/2015 04:19 PM IST
India test squad announced for sri lanka series

శ్రీలంక పర్యటనకు వెళ్లే బారత జట్టు సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇవాళ ప్రకటించింది. శ్రీలంకతో ఆగస్టులో జరగబోయే టెస్టు సిరీస్ కు టీమిండియా జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జింబాబ్వే పర్యటనలో కొంతమేరకు రాణించిన హర్భజన్ సింగ్ కు ఈ జట్టులో స్థానం లభించింది. ఈ జట్టులో హర్భజన్ తో పాటు గత కొంత కాలంగా టీమిండియా జట్టుకు దూరంగా వున్న ఇషాంత్ శర్మలకు కూడా స్థానం లభించింది. అయితే టీమిండియా మాజీ టెస్టు కెస్టెన్ ప్రశంసలు పోందిన రవింద్రా జెడేజాను మాత్రం బిసిసిఐ ఈ పర్యటన నుంచి తప్పించింది. కోహ్లీ నాయకత్వంలో టీమీండియా శ్రీలంక టూర్ కు వెళ్లనుంది. జింబాబ్వే పర్యటనకు డైరెక్టర్ లేకుండానే వెళ్లి విజయాన్ని అందుకున్న టీమిండియా జట్టుకు.. శ్రీలంక పర్యటనకు మాత్రం భిన్నంగా చర్యలు తీసుకుంది బిసిసిఐ. ఈ సీరిస్ కు రవిశాస్త్రీ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారని ప్రకటించింది.

కాగా నాలుగేళ్ల తరువాత అమిత్ మిశ్రాను టెస్టు జట్టులో చోటు లభించింది. ఆగస్టు 12 నుంచి లంక పర్యటనలో మన జట్టు మూడు టెస్టుల సిరీస్ ను ఆడనుంది. సెలక్షన్ కమిటీ సందీప్ పాటిల్ ఆధ్యక్షతన సమావేశమైన తుది జట్టును ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న వారిలో శిఖర్ దావన్, మురళి విజయ్, కేఎల్ రాహుల్, చత్తిస్వర్ పుజరా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్, వరుణ్ అరోన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్ లు వున్నారు. కాగా విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రెండవ సీరీస్ కావడంతో.. మూడు టెస్టు సిరీస్ లు వుండడం తో ఆయన కూడా ఈ సిరీస్ ను ప్రతిష్ట్మాతకంగా తీసుకుంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles