BCCI adopts Chennai Super Kings, Rajasthan Royals suspension recommendations

Bcci adopts chennai super kings rajasthan royals suspension recommendations

BCCI decides, implement Lodha committee order, CSk, RR, judicial committee, suspend, Chennai Super Kings, Rajasthan Royals, betting scandal in 2013, IPL governing council

The franchise owners of Indian Premier League teams Rajasthan Royals and Chennai Super Kings have been suspended for two years by the Indian cricket board. The board on Sunday followed the recommendation of India's Supreme Court-appointed Lodha committee to ban the pair for their role in an illegal betting scandal that erupted in 2013.

చెన్నై, రాజస్థాన్ జట్ల మీద నిషేదం అమలు.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం

Posted: 07/20/2015 04:12 PM IST
Bcci adopts chennai super kings rajasthan royals suspension recommendations

సుప్రీంకోర్టు న్యాయమూర్తి... జస్టిస్ లోథా కమిటీ తీర్పును పూర్తిగా అమలుచేయాలని నిర్ణయించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఇటీవల ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం విధిస్తూ... లోథా కమిటీ తీర్పు ఇచ్చింది. దీన్ని అధ్యయనం చేసేందుకు రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై జస్టిస్ లోథా కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బిసిసిఐ మాజీ అద్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మొయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహభాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం పెట్టింది.

కేవలం ఐపిఎల్ మాత్రమే కాకుండా ఎలాంటి క్రికెట్ టోర్నమెంటులలోనూ వీరి భాగస్వాములకు కాకుండా వారిపై జీవితకాల నిషేధానికి కమిటీ ఆదేశించింది. ఐపీఎల్‌ ప్రతిష్టను మేయప్పన్‌, కుంద్రా దిగజార్చారని లోథా కమిటీ వ్యాఖ్యానించింది. ఐపిఎల్ ఫిక్సింగ్ బారిన పడడం అప్పట్లో సంచలనం రేపింది.కమిటీ ఆరు వారాల్లోగా నివేదిక ఇస్తుందని కౌన్సిల్‌ తెలిపింది. ఐపీఎల్ తొమ్మిదో ఎడిషన్‌ను మరింత పగడ్బందీగా నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అయితే, లీగ్‌ భవితవ్యంపై ఎలాంటి ఆందోళనా అక్కర్లేదంది. ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలా వద్దా అనేది సుప్రీంకోర్టు తేల్చుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles