Zimbabwe stun India to level series

Zimbabwe stun india to level series

India Zimbabwe t20, 2nd T20 match, Zimbabwe, India

Zimbabwe beat India by 10 runs in their second and final Twenty20 International to draw the series 1-1 at the Harare Sports Club here. Opener Chamu Chibhabha's 67 guided the hosts to 145 for 7 in reply to which the visitors could manage only 135 for 9 in the allotted 20 overs.

జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి.. ఊహించని షాక్

Posted: 07/20/2015 11:09 AM IST
Zimbabwe stun india to level series

పసికూన జింబాబ్వే వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోవడం, తొలి టీ20లో భారీ తేడాతో ఓటమితో సహనం కోల్పోయిన ఆతిథ్య జట్టు రెండో టీ20లో నెగ్గి భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా, బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అలా పర్యటనను అజేయంగా ముగించాలన్న ఆశ నెరవేరకుండాపోయింది. తొలుత సహ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతుంటే చిభాభా బాధ్యతాయుత ఇన్నింగ్స్.. అనంతరం సహ బౌలర్లు వికెట్ల వేటలో తడబడుతుంటే, ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేసే క్రెమెర్ మిస్టరీ స్పిన్.. వెరసి చివరిదైన రెండో టీ20లో జింబాబ్వే అనూహ్య విజయం.. భారత్‌కు దిమ్మతిరిగిపోయే షాక్. ఈ మ్యాచ్‌లో 10 పరుగులతో ఓడి సిరీస్‌ను సోలోగా సొంతం చేసుకునే అవకాశాన్ని దూరం చేసుకుని జింబాబ్వేతో 1-1తో పంచుకుంది రహానే సేన.

భారత్ 146 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్.. క్రెమెర్ ధాటికి నిర్ణీత ఓవర్లలో 9వికెట్లకు 135 పరుగులే చేసింది. తొలి ఓవర్ మూడో బంతికే రహానే లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ కాగా, ఉతప్ప 25 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయం దిశగా నడిపాడు. అయితే టీమ్‌స్కోరు 61 పరుగుల వద్ద ఉతప్ప కూడా బ్యాట్ ఎత్తేయడం, మరెవరూ పోరాట పటిమ చాటకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. బిన్నీ 24 పరుగులు, తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన సంజూ శాంసన్ 19 పరుగులు, అక్షర్ పటేల్ 13, మురళీ విజయ్ 13 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, మోఫూ, సీన్ విలియమ్స్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. ఓపెనర్ చిభాభా (51 బంతుల్లో 9 ఫోర్లతో 67) అర్ధసెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 145 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. మరో ఓపెనర్ మసకద్జ 19, చిగుంబుర స్థానంలో వచ్చిన సీన్ విలియమ్స్ 17 రన్స్ చేశారు. లోయరార్డర్ మొత్తం తేలిపోయింది. ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో భారత్ మొత్తం 16 పరుగులు ఇవ్వడం కూడా జింబాబ్వే ఈస్థాయి స్కోరు చేయడానికి ఊతమిచ్చింది. ఈ ఎక్స్‌ట్రా పరుగులే ఆ జట్టులో నాలుగో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. భారత పేసర్లు భువనేశ్వర్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా, సందీప్ శర్మ, బిన్నీ, స్పిన్నర్ అక్షర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. చిభాభా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌నూ సొంతం చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Zimbabwe t20  2nd T20 match  Zimbabwe  India  

Other Articles