bangladesh won sensational match against south africa in mirpur | Oneday Matches

Bangladesh won sensational match against south africa in mirpur

bangladesh team, bangladesh vs south africa, south africa vs bangladesh, bangladesh players, south africa players

bangladesh won sensational match against south africa in mirpur : Bangladesh square series, seal Champions Trophy place.

బంగ్లా ముందు చాపచుట్టేసిన సఫారీలు

Posted: 07/13/2015 02:54 PM IST
Bangladesh won sensational match against south africa in mirpur

టీమిండియాను చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు తాజాగా అన్నిరంగాల్లో బలియజట్టుగా పేరుగాంచిన దక్షిణాఫ్రికాపై రికార్డు విజయం నమోదు చేసుకుంది. తొలివన్డేలో సఫారీల ముందు నిలబడలేకపోయిన బంగ్లా ఆటగాళ్లు.. రెండో వన్డేలో మాత్రం బంగ్లాముందు సఫారీలు చాప చుట్టేశాయి. మిర్పూలో లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే! ఈ సిరీస్ లో భాగంగా సఫారీల చేతిలో బంగ్లా తొలివన్డే చేజార్చుకుంది. అయితే.. ఈ సిరీస్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో వున్న బంగ్లాదేశ్.. అదే కసితో సఫారీ జట్టును చిత్తుచేసి సిరీస్ పై ఆశలను సజీవంగా వుంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. బంగ్లా బౌలర్ల ముందు ఏమాత్రం నిలబడలేకపోయారు. బంగ్లా పటిష్ట బౌలింగ్ ముందు సఫారీల వికెట్లు టపీటపీమని వరుసగా పడిపోయాయి. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 46 ఓవర్లకే 162 పరుగులు చాప చుట్టేసింది.

ఆ తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆటగాళ్లు.. మెరుగైన ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్లారు. బ్యాట్స్ మెన్ సౌమ్య సర్కార్ (88 నాటౌట్), మహ్మదుల్లా (50) ఇద్దరు అర్ధశతకాలతో అదరగొట్టేశారు. దీంతో బంగ్లా జట్టు కేవలం 27.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  south africa  

Other Articles