Sachin Tendulkar Misses His Last Bus in Haseley Oxfordshire And Asks Fans For Help | Twitter

Sachin tendulkar misses last bus asks fans for help twitter

Sachin Tendulkar, Sachin Tendulkar news, Sachin Tendulkar twitter, Sachin Tendulkar missed last bus, Sachin Tendulkar comments, Sachin Tendulkar tweets

Sachin Tendulkar Misses Last Bus Asks Fans For Help Twitter : The greatest cricketer who holds several records so far in cricketing history, was in England to watch the Wimbledon tennis tournament on Saturday. While he was on a visit to an English village, Sachin missed his last bus at Great Haseley. He then asked for a lift from his Twitter followers.

‘లాస్ట్ బస్ మిస్ అయ్యాను.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా?’

Posted: 07/13/2015 01:49 PM IST
Sachin tendulkar misses last bus asks fans for help twitter

క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. రిటైర్ మెంట్ ప్రకటించిన అనంతరం తన జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యాపిల్లలతో విదేశాల్లో చక్కర్లు కొట్టడం, తనకు నచ్చిన టూరిస్ట్ స్పాట్లకు విచ్చేయడం, ఇంకా ఎన్నో ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే వింబుల్డన్ టోర్నీని ఆస్వామదించేందుకు సచిన్ తన భార్య అంజలితో కలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ తాను అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ట్విటర్ లో వేదికగా అభిమానులకు తెలియజేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసి, తనలో దాగిన చిలిపితనాన్ని బయటపెట్టేశాడు.

‘నేనిప్పుడు గ్రేట్ హోస్లేలో వున్నా.. చిట్టచివరి బస్ కూడా మిస్ అయ్యాను.. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వగలరా?’ అంటూ సచిన్ ట్విటర్ లో చిలిపి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. రోడ్డు పక్కగా వున్న బస్ స్టాప్ లోని దగ్గరున్న చెట్టుకుని ఆనుకుని, బెంచీపై అటుగా చూస్తూ కూర్చున్న ఫోటోను అప్ లోడ్ చేశాడు. ఈ విధంగా సచిన్ పోస్ట్ చేయడంపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ‘నేను అక్కడ వుండివుంటే ఖచ్చితంగా లిఫ్ట్ ఇచ్చేవాడిని’ అంటూ ఓ భారతీయ అభిమాని సచిన్ ట్వీట్ కి రీట్వీట్ చేశాడు. అలాగే.. ‘చివరికి దేవుడు కూడా బస్ మిస్ చేసుకున్నాడు’, ‘సచిన్ ని మిస్ చేసినందుకు ఆ బస్ డ్రైవర్ దురదృష్టవంతుడు’.. అంటూ రకరకాలుగా అభిమానులు ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  twitter  

Other Articles