Sachin Tendulkar fan Sudhir Gautam attacked in Bangladesh after second ODI

Team india fan sudhir gautam under tight security following attack in dhaka

Bangladesh, India, Ind vs Ban 2015, Cricket, Team India Fan Sudhir Gautam Attacked in Dhaka, Ravichandran Ashwin, Mustafizur Rahman, lesson, kidnap, Bangladesh, India, Shere Bangla National Stadium, Mirpur, Ind vs Ban, 2015, Bangladesh,India, Mirpur, Ind vs Ban, 2015, Cricket, Live Cricket Score, Live Score India vs Bangladesh, 1st ODI in Mirpur - Live Score latest Ind vs Ban, 2015 news

Team India and Sachin Tendulkar fan Sudhir Gautam has claimed that he was attacked by Bangladesh fans in Dhaka.

సుధీర్ గౌతమ్ కు బంగ్లా పోలీసుల సెక్యూరిటీ

Posted: 06/23/2015 06:23 PM IST
Team india fan sudhir gautam under tight security following attack in dhaka

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ గౌతమ్‌ దాడికి గురైన నేపథ్యంలో.. ఆయనకు బంగ్లాదేశ్ పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సచిన్ వీరాభిమానిగా టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా గ్యాలరీలో సందడి చేసే సుధీర్ గౌతమ్‌పై బంగ్లాదేశీయులు దాడికి ఒడిగట్టారు. చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని.. ఒళ్లంతా త్రివర్ణ పతాకంలోని రంగులు వేసుకుని క్రికెటర్లను ఎంకరేజ్ చేసే సుధీర్‌పై బంగ్లాదేశ్‌‍తో రెండో వన్డే ముగిసిన అనంతరం అతనిపై అభిమానులు దాడికి దిగారు. సుధీర్‌పై దాడికి సంబంధించిన వార్త అన్నీ ఛానెళ్లలో ప్రసారం కావడమే కాకుండా.. అన్ని పత్రికల్లో ప్రచురితమైంది.
 
దీంతో, బంగ్లాదేశ్ పోలీసు అధికారులు అతనికి సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియంకు మంగళవారం సుధీర్ వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరు గార్డులు అతని వెంటే ఉండగా, మూడో వన్డే జరిగే రోజున సుధీర్‌కు నలుగురు గార్డులు కాపలా ఉంటారని బంగ్లా పోలీసు అధికారులు చెప్పారు. సుధీర్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌కు కూడా గట్టి భద్రతను కల్పించారు. ఇకపోతే.. ధోనీ మ్యాచ్ ఫీజులో కోత పడిన సంగతి తెలిసిందే. మైదానంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముఫ్తికార్ రెహ్మాన్‌ను తోసేయడంతో ధోనీ మ్యాచ్ ఫీజులో 75 శాతం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  Mustafizur Rahman  lesson  kidnap  

Other Articles