India Team for Bangladesh -- Golden Handshake for Past Heroes? Or Test New Blood?

India selectors expected to pick largely unchanged squad for bangladesh tour

Bangladesh, India, Cricket, India Team for Bangladesh, Golden Handshake for Past Heroes? Or Test New Blood, latest Cricket news, Bangladesh, BCCI, Cricket, India, India in Bangladesh 2015, MS Dhoni, Selectors, Sports, Virender Sehwag, Zaheer Khan, Harbhajan Singh, gautam gambhir, Yuvraj Singh, Virat Kohli

India play one Test and three One-Day Internationals in June in Bangladesh. With several senior players asking for rest, BCCI might choose to hand a fitting farewell to India's all-time favourites -- Virender Sehwag, Zaheer Khan, Harbhajan Singh and Yuvraj Singh.

బంగ్లా టూర్ లో ఆ నలుగురికి స్థానం దక్కెనా..?

Posted: 05/19/2015 05:04 PM IST
India selectors expected to pick largely unchanged squad for bangladesh tour

ఐపీఎల్ ముగిసి ముగియగానే వచ్చే నెల ఆరంభంలో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు సిద్దం కానుంది. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బిసిసిఐ.. ఇందుకోసం జట్టును రేపు బుధవారం ఎంపిక చేయనుంది. ప్రపంచ కఫ్ నుంచి తిరిగిరాగానే ఐపీఎల్ లో శ్రమించిన పలువురు సీనియర్లు.. బంగ్లాదేశ్ టూరుకు విముఖత వ్యక్తం చేశారు. భారత జట్టు సారధి మహేంద్రసింగ్ ధోణితో పాటు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచ కప్ తరువాత తన బాల్యస్నేహితురాలిని పరిణయమాడిన సురేష్ రైనా.. త్వరలో పెళ్లి కోడుకు కాబోతున్న రోహిత్ శర్మ తదితరులు ఇప్పటికే తమకు బంగ్లా పర్యటన నుంచి మినహాయింపు కల్పించాలని బిసిసిఐని కోరినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. బుధవారం ముంబాయిలో జట్టను ఖరారు చేయనుంది. అయితే ఈ నలుగురి స్తానంలో టీమిండియా జట్టుకు దశాబ్దకాలం పాటు సేవలందించి.. రిటైర్మెంట్ అంచున నిలిచిన యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్, వీరేంద్ర సేహ్వాగ్ వంటి కీలకమైన ఆటగాళ్లకు వీడ్కోలు పలికేందుకు వారిని ఎంపిక చేయనున్నారా అన్న ఉత్కంఠకు రేపు బిసిసిఐ తేర తీయనుంది. కాగా ప్రస్తుతం వున్న టీమిండియా జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే జట్టుకు ప్రకటించే అవకాశాలున్నాయని మరికోందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్లకు అవకాశం కల్పించి వారికి సముచిత గౌరవాన్ని పలుకుతారా..? లేక కొత్త యువరక్తం తో జట్టును ఎంపిక చేస్తారా అన్న విషయాలను వేచి చేడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  bangladesh  cricket news  

Other Articles