టీమిండియా జట్టుకు సరైన కొత్త కోచ్ కోసం బీసీసీఐ గతకొన్నాళ్ల నుంచి కసరత్తు చేస్తూ వస్తోంది. ఈ పదవికి గంగూలీ సహా మరికొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతమున్న జట్టుకు ఎంతో అనుభవమున్న ఆటగాడు కోచ్ గా నియమితులైతే ఎంతో ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా గంగూలీ కోచ్ గా నియమితులైతే బాగుంటుందని చెబుతున్నారు. ఎందుకంటే.. గంగూలీ చాలా అనుభవం కలిగిన ఆటగాడని, ప్రస్తుత జట్టుకు అతడు కోచ్ గా వ్యవహరిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలనాటి మేటిదిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఈ క్రమంలోనే గవాస్కర్ మాట్లాడుతూ.. టీమిండియా కోచ్ గా సౌరవ్ గంగూలీ మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయని అన్నారు. గంగూలీ అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా లేదా టీమ్ డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డాడు. ‘భారత్ ఆడబోయే మ్యాచ్లు ఎక్కువగా స్వదేశంలో, ఉపఖండంలో ఉన్నాయి. టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఈ పదవిలో గంగూలీని నియమిస్తే జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడు. దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ల అవసరం ఉండదు’ అని గవాస్కర్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.
ఇదిలావుండగా.. టీమిండియా కోచ్ పదవికి కొన్నిరోజుల నుంచి గంగూలీ పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం దీనిపై తన అభిప్రాయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. అతనితోపాటు మరికొందరు ఈ కోచ్ బరిలో వున్న నేపథ్యంలో దాదా సైలెంట్ గా వుండవచ్చునని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more