mumbai indians won match against kolkata knight riders | wankhade stadium

Mumbai indians won match against kolkata knight riders playoffs wankhade stadium

mumbai indians, kolkata knight riders, rohit sharma, hardhik pandya, harbhajan singh, kieron pollard, sachin tendulkar, gautam gambhir, robin uthappa, wankhade stadium

mumbai indians won match against kolkata knight riders playoffs wankhade stadium : Mumbai Indians' win over Knight Riders makes IPL playoff race more interesting

ఉత్కంఠ పోరులో ముంబై మ్యాజిక్ చెలరేగిన పాండ్య.. రాణించిన పొలార్డ్

Posted: 05/15/2015 10:19 AM IST
Mumbai indians won match against kolkata knight riders playoffs wankhade stadium

ఐపీఎల్-8లో భాగంగా ఇదివరకు జరిగిన మ్యాచులో వేరు.. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ వేరు! ఎందుకంటే.. ఈ మ్యాచ్ గెలిస్తేనే ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఆశలు సజీవమవుతాయి. అటు కోల్ కతా గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి వెళుతుంది. ఇలా రెండు జట్లు తమతమ ఆశలతో బరిలోకి దిగిన ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై సంచలనాత్మకంగా ఆడింది. తొలుత బ్యాటింగ్‌లో తడబడ్డా... యువ పాండ్యా వీరోచిత బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఓటమి అంచుల్లోంచి ఆఖరి ఓవర్లో పొలార్డ్ తన మ్యాజిక్ చేశాడు. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుని.. కోల్‌కతానూ ఒత్తిడిలోకి నెట్టింది.

ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైకి ఆదిలోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్ పార్థీవ్(21), లెండిల్ సిమ్మన్స్ (14) ఓ మోస్తరుగా ఆడి పవెలియన్ చేరారు. ఇక ఫామ్‌లో వున్న రాయుడు (2) కూడా వెనుదిరగడంతో ముంబై 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్, పొలార్డ్ కలిసినా ఇన్నింగ్స్‌లో వేగం పెరగలేదు. 12వ ఓవర్‌లో నరైన్ అద్భుత బంతితో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. అయితే పాండ్యా రాకతో ముంబై ఇన్నింగ్స్‌కు అసలైన ఊపు వచ్చింది. పొలార్డ్‌ను మించి దూకుడును కనబరిచి.. జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు రాగా ఇందులో 50 పరుగులు పాండ్యావే కావడం విశేషం.

ఇక 172 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు ఆరో ఓవర్‌ వరకు బాగానే రాణించారు. ఉతప్ప (25), గంభీర్ (38) ఫర్వాలేదనిపించారు. అయితే.. మనీష్ పాండే (1) రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన యూసుఫ్ పఠాన్ (52) పరుగులతో చెలరేగాడు. పఠాన్‌తో కలిసి షకీబ్ (23) వేగంగా ఆడాడు. చక్కటి ఫోర్లతో ప్రమాదకరంగా మారుతున్న దశలో షకీబ్, పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. ఇక రస్సెల్ (2) విఫలమయ్యాడు. ఇలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ అద్భుతమే చేశాడు. పఠాన్‌ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai indians  kolkata knight riders  wankhade stadium  

Other Articles