Virat Kohli under watch for his behaviour, BCCI chief Dalmiya

Bcci keeping an eye on virat kohli s behaviour

BCCI keeping an eye on Virat Kohli's behaviour, india test cricket captain virat kohli, cricket, cricket news, bcci, board of control for cricket in india, virat kohli, BCCI president Jagmohan Dalmiya, bcci on virat kohli behaviour

The Board of Cricket Control in India has been reported to be keeping eye on India's new Test captain Virat Kohli over his behaviour. BCCI president Jagmohan Dalmiya said that Kohli will be on notice over his behaviour.

కెప్టెన్, వైస్ కెప్టెన్ పై నిఘా కొనసాగింపు: బీసీసీఐ ఛీప్ దాల్మియా

Posted: 04/25/2015 04:34 PM IST
Bcci keeping an eye on virat kohli s behaviour

టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టన్, వన్డే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ నిఘా వుంచినట్లు సమాచారం. అతని ప్రవర్తనను పరిశీలిస్తున్నామని, బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ ధాల్మియా తెలిపారు. భారత యువ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసిసిఐ పరిశీలన వుంటుందని చెప్పారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి వుంటే.. తప్పకుండా తీసుకుంటామని ఆయన ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. కోహ్లీ విషయంలో బీసీసీఐ ప్రత్యక దృష్టి తీసుకుంటుందన్న విషయాన్ని ఆయన తోసిపుచ్చారు.

కోహ్లీ అంశంలో తాము కావాలని జోక్యం చేసుకోవడం లేదని, అలాఅని అంతా బాగానే వుందని కూడా అనడం లేదని దాల్మియా అన్నారు. ఒక వేళ కోహ్లీ వైఖరిపై చరయలు తీసుకోవాల్సిన అవసరం వుందా అని నిర్ణయించే ముందు తాను కూడా అతని పర్యవేక్షించాల్సిన అవసరం వుంటుందని చెప్పారు. ఎందుకంటే కోహ్లీ అంశంలో ఏ విషయాన్ని అంత తేలికగా మాట్లాడేది కాదని దాల్మియా పేర్కొన్నారు. ప్రపంచ కప్ సమయంలో ఓ విదేశీ జర్నలిస్టుపై అతను దురుసుగా ప్రవర్తించిన అంశంతో పాటు.. అంతకు ముందు అసీస్ పర్యటనలో ఆయన మీడియా సమక్షంలో దురుసుగా వ్యవహరించారు. అంతే కాకుండా పలు దేశీయ ఆటల్లో, తాజా ఐపీఎల్ లోనే పలుసార్లు కోహ్లీ స్టెడ్జింగ్ చేశాడన్న ఆరోపణలు వున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  bcci  board of control for cricket in india  virat kohli  

Other Articles