Sunil Narine to undergo test in Chennai again

Sunil narine reported for suspect action again

IPL8, Sunil Narine, Kolkata Knight Riders, Richard Illingworth, Vineet Kulkarni, Narine suspected illegal bowling action, ipl on-field umpires, Sunrisers Hyderabad, narines illegal bowling action, Sunil Narine's Bowling Action, IPL season 8, Indian Premier League., Sunil Narine's Bowling Action in chennai,

West Indies mystery spinner Sunil Narine has again been reported for a suspect illegal bowling action by the on-field umpires during Kolkata Knight Riders’ away IPL match against Sunrisers Hyderabad on April 22.

నరేన్ కు మళ్లీ కష్టాలు.. చెన్నైలో పున:పరీక్ష

Posted: 04/25/2015 04:22 PM IST
Sunil narine reported for suspect action again

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనమిదవ సీజణ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నైలో నిర్వహించిన బౌలింగ్ టెస్టులో బీసీసీఐ పచ్చ జెండాతో కదనరంగంలోకి అడుగుపెట్టిన వెస్టీండీస్ స్పీన్ బౌలింగ్ దిగ్గజం సునీల్ నరేన్ కు మళ్లీ కష్టాలు వెంబడించాయి. ఆయన బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పందంగా వుందని ఈ నెల 22న జరిగిన మ్యాచ్ లో అంపర్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు. సరిగ్గా ఇరవై రోజుల వ్యవధిలో మళ్లీ ఆయన బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణల రావడంతో మ్యాచ్ అధికారులకు విషనాన్ని తెలిపారు.

ఈ నెల 22న విశాఖపట్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో నరేన్ బౌలింగ్ కోంత అనుమానాస్పదంగా వుందని ఆన్ ఫ్టీల్డ్ అంపర్లు వినీత్ కుల్ కర్ణీతో పాుట రిచార్డ్ ఇల్లింగ్వర్త్ లు గమనించారు. మ్యాచ్ పూర్తి కావడంతో ఈ విషయాన్ని అధికాకుల వద్దకు తీసుకువెళ్లారు. కాగా నరేన్ బౌలింగ్ యాక్షన్ పై అరోపణలు వెల్లువెత్తినా.. తాజా ఐపీఎల్ అనుమానాస్పద బౌలింగ్ విధానం నేపథ్యంలో ఆయన రానున్న ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా బౌలింగ్ చేసే అవకాశం వుంది. అయితే ఆయన తన బౌలింగ్ యాక్షన్ పై మళ్లీ చెన్నైలో శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో పున:పరీక్ష మాత్రం హాజరుకావాల్సి వుంటుందని అధికారులు చెప్పారు. గతంలో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలతో గత ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు సునీల్ నరేన్ దూరమయ్యారు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014లో టైటిల్ ఛాంపియన్స్‌గా నిలవడంలో సునీల్ నరేన్ కీలకపాత్ర పోషించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  IPL8  Sunil Narine  Kolkata Knight Riders  

Other Articles