ఐపిఎల్-8 సీజన్ లో ఇంకా బోనికొట్టలేదని తెగ మదన పడుతున్నారు హైదరాబాద్ సన్ రైజర్స. కానీ ఇక మీదట వచ్చే అవకాశాలను మాత్రం అసలు వదులకోవడానికి ఆ జట్టు సిద్దంగా లేదు. ఎందుకంటే ఈ సీజన్ ఫేవరెట్ జట్టుల్లో ఒకటిగా ఉన్న సన్ రైజర్స్ ఇప్పటి వరకు బోణీ కొట్టక పొవడం వారికి నిజంగా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. అందుకే ఎలాగైనా ఐపిఎల్ లో అదిరిపోయే బోణీ కోసం తహతహలాడుతున్నారు సన్ రైజర్ టీం ఆటగాళ్లు.
ఐపీఎల్-8లో భాగంగా సోమవారం జరగనున్న 8వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి బోణి కొట్టాలని సన్ రైజర్స్ భావిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి చవిచూసింది. మరోవైపు తన తొలి మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ కోల్ కతాను కంగుతినిపించిన బెంగళూరు అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన డాషింగ్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ పై చాలెంజర్స్ ఆశలు పెట్టుకుంది. గేల్ ను ఎంత తొందరగా అవుట్ చేస్తారనే దానిపై హైదరాబాద్ విజయవకాశాలు ఆధాపడివుంటాయి. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్, రోసో స్థాయి మేరకు ఆడితే బెంగళూరును ఆపడం కష్టం. బౌలింగ్ ను నమ్ముకున్న సన్ రైజర్స్ తొలి మ్యాచ్ లో స్టెయిన్ ను ఆడించకుండా మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో అతడు బరిలోకి దిగే అవకాశముంది. ధావన్, వార్నర్, కానే విలియమ్సన్, బొపారా బ్యాటింగ్ భారం మోయనున్నారు.
కానీ సన్ రైజర్లు ఎంతలా ఆవపడుతున్నా.. బెంగళూరు మాత్రం ఆ ఆశలకు గండి కొట్టే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ధావన్, వార్నర్, కానే విలియమ్సన్ లాంటి వాళ్లు గనక ఈ మ్యాచ్ లో తమ పర్ఫామెన్స్ తో అదరగొడితే మాత్రం హైదరాబాద్ సన్ రైజర్లకు ఇప్సట్లో రైజింగ్ లేనట్లే మరి. అయినా క్రికెట్ అన్నాక ఏమైనా జరగొచ్చు అనే సామెత ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మ్యాచ్ చూడాల్సిందే.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more