Australia thrashed New Zealand to become World Cup champions

Australia beat new zealand to become world cup champions

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Australia won their fifth World Cup, beating fellow co-hosts New Zealand by seven wickets in a one-sided final at the Melbourne Cricket Ground.

ఐదోసారి..ప్రపంచ క్రికెట్ విశ్వవిజేత అస్ట్రేలియా.

Posted: 03/29/2015 06:44 PM IST
Australia beat new zealand to become world cup champions

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో జగజ్జేతగా నిలిచింది అస్ట్రేలియా. ముచ్చటగా ఐదవసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. రెండు అతిధ్య జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా జరగిన అఖరి పోరాటంలో అసీస్ ధాటికి కివీస్ మెకరరిల్లింది. ఇవాళ జరగిన మహాసంగ్రామంలో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్‌ను కైవసం చేసుకుంది. 16.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ సంచలనం స్మిత్.. సౌథీ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి విజయానికి కావాల్సిన పరుగులు సాధించాడు. ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా ముగిసిన ఫైనల్‌లో ఆసీస్ అన్ని రంగాల్లో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించి ఈ విజయాన్ని కైవసం చేసుకుంది.

ఇప్పటి వరకూ జరిగిన 11 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా కప్‌ను సాధించటం ఇది ఐదో సారి. అనుకున్నట్లుగానే ఇదే తన ఆఖరి మ్యాచ్ అని ప్రకటించిన కెప్టెన్ క్లార్క్‌కు కలకాలం గుర్తిండిపోయేలా ఆటగాళ్లు సంయుక్తంగా ఈ విజయాన్ని అందించారు. క్లార్క్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 74 పరుగులతో జట్టు విజయంలో భాగం పంచుకోవడంతో పాటు తన వన్డే కెరీర్‌ను ముగించాడు. లీగ్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై ఓటమి చవిచూసిన ఆసీస్ జట్టు ఫైనల్‌లో అదే జట్టును ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరంభ ఓవర్లలోనే కెప్టెన్ మెక్‌కలమ్ వికెట్ కోల్పోయి మరి ఏ దశలోనూ కోలుకోలేదు. అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు న్యూజిలాండ్ ఆటగాళ్లను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు జాన్సన్, స్టార్క్, హేజిల్‌వుడ్, ఫాల్క్‌నర్‌లు యార్కర్లు, షార్ట్ పిచ్ బంతులు, స్లో బంతులు, లెన్త్ బాల్స్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడ్డారు. ఒక ఇలియట్, టేలర్ మినహా న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లలో ఎవరూ రాణించలేక పోయారు.  దీంతో నిర్ణీత ఓవర్లు మిగిలివున్నా విక్కెట్లు లేకపోవడంతో న్యూజీలాండ్ కేవలం 183 పరుగులు చేసిన అసీస్ ముందు 184 పరుగులు లక్ష్యాన్ని నిరదే్శించింది.

లక్ష్యచేధనలో ఇన్నింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆరంభంలోనే ఫించ్ వికెట్‌ను కోల్పోయినా.. వార్నర్ తాను ఉన్నంత సేపు ధాటిగా ఆడి స్కోరును పెంచాడు. వార్నర్ ఔట్‌తో బరిలోకి వచ్చిన క్లార్క్, స్మిత్‌లు బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత కివీస్ బౌలర్లపై వారు విరుచుకుపడ్డాడు. ఇంకా 16.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందించటంలో కెప్టెన్ క్లార్క్ తన పాత్ర వహించాడు. స్మిత్ చివరి వరకు ఉండి గెలుపునకు కావాల్సిన పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.

న్యూజిలాండ్ విసిరిన 184 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్ గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(45)పరుగులతో ఆకట్టుకున్నాడు. వార్నర్ వెనుదిరిగిన అనంతరం స్టీవ్ స్మిత్ కు జత కలిసిన మైకేల్ క్లార్క్ బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే విజయానికి మరో 11 పరుగులు కావాల్సిన తరుణంలో క్లార్క్(74) పెవిలియన్ కు చేరాడు.  ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ మార్కును చేరిన స్మిత్ (56*) మిగతా పనిని పూర్తి చేశాడు.

ఆసీస్ టాప్ ఆర్డర్ రాణించడంతో లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో చేరుకుని కివీస్ కు షాకిచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో  హెన్రీకి రెండు వికెట్లు దక్కగా, బౌల్ట్ కు ఒక వికెట్ లభించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 45.0 ఓవర్లలో 183 పరుగులకే చాప చుట్టేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గ్రాంట్ ఇలియట్(83), రాస్ టేలర్(40) పరుగులు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles