Virat answers cyber-bullies, holds Anushka's hand as they leave airport

Virat answers cyber bullies holds anushka s hand as they leave airport

virat kohli, Anushka sharma, India vs Australia, team india captain MS Dhoni, icc cricket worldcup-2015, semi final, India versus Australia, ICC Cricket World Cup 2015, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, mumbai, India,

Virat answers cyber-bullies, holds Anushka's hand as they leave airport

అనుష్కపై విమర్శలకు చేతలతో బదులిచ్చిన కోహ్లీ

Posted: 03/28/2015 08:51 PM IST
Virat answers cyber bullies holds anushka s hand as they leave airport

ప్రపంచకప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తి. అవి కాస్తా అనుష్క శర్మ కారణంగానే అంటూ అమెను నెట్ జనులు తిట్టిపోస్తున్న తరుణంలో విరాట్ వారందరికీ తన చేతలతో బదులిచ్చాడు. అనుష్క శర్మ రావడంతోనే విరాట్ కోహ్లీ కీలకమైన మ్యాచ్ లో దృష్టి సారించలేక తన ప్రేయసితో గడిపేందుకే అధిక ప్రాధాన్యతను ఇచ్చాడని.. అందుచేతే సెమీస్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడని, నెట్ జనులు విమర్శలు గుప్పించారు. అంతేకాదు దీనంతకీ కారణం అనుష్క శర్మేనంటూ అమెను కూడా తిట్టిపోశారు.

అయితే నెట్ జనుల విమర్శలకు భారత స్టార్ బ్యాట్ మెన్ విరాట్ చేతలతోనే బదులిచ్చాడు. నెట్ జనులు ఎంతగా ఆడిపోసుకున్నా.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన ప్రేయసి అనుష్క శర్మ చేయి పట్టుకుని నడుస్తూ.. ముందుకు సాగాడు. సెమీస్ లో ఓటమి పాలవ్వడంతో అస్ట్రేలియా నుంచి భారత్ లోని ముంబాయికి తిరిగివచ్చిన కోహ్లీ వెంట అనుష్క శర్మ కూడా వుంది. విమానం లోంచి దిగిన క్షణం నుంచి కారులో ఎక్కి వెళ్లే వరకు అనుష్కకు విరాట్ రక్షణగా.. మరోలా చెప్పాలంటే బాడీగార్డు మాదిరిగానే వ్యవహరించాడు. అంతేకాదు అసాంతం అమె చెయి పట్టుకుని నడిచి.. విమర్శకులు నోళ్లకు తాళాలు వేశాడు. సోషల్ మీడియాలో విరాట్ ప్లాప్ షోపై అభిమానులు అనుష్కను తిట్టిపోయగా, క్రీకెట్, సినీమా రంగానికి చెందిన పలువురు అమెకు అండగా నిలిచారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీ సహా బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, అర్జున్ కపూర్ ఇలా అనేక మంది అనుష్కకు అండగా నిలిచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  virat kohli  Anushka sharma  

Other Articles