Umesh yadav takes bowling tips from pakistan cricketers akram akhtar

umesh yadav news, umesh yadav cricket, umesh yadav worldcup innings, umesh yadav career, worldcup 2015, wasim akram news, shoaib akhtar news, umesh yadav shoaib akhtar news, umesh yadav with wasim akram, umesh brother ramesh yadav

umesh yadav takes bowling tips from pakistan cricketers akram akhtar : Indian cricket bowler ramesh yadav brother has confirmed that his brother takes some bowling tips from pakistan famous cricketer wasim akram and shoaib akhtar. That's why he is doing well in worldcup tournament

‘పాక్’ సహకారంతో రాటుదేలిన ఇండియన్ బౌలర్

Posted: 03/23/2015 04:29 PM IST
Umesh yadav takes bowling tips from pakistan cricketers akram akhtar

వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే! ఈ టోర్నీకంటే ముందు ఆడిన ఇతర సిరీస్ లలో ఘోరంగా విఫలమైన ఇతగాడు.. ప్రపంచకప్ లో మాత్రం తన బౌలింగ్ ప్రతిబతో దిగ్గజ బ్యాట్స్ మెన్లను ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అయితే.. ఇతను ఈ విధంగా చెలరేగడానికి కారణం మాత్రం పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు దిగ్గజ బౌలర్లని ఉమేష్ సోదరుడు రమేష్ యాదవ్ చెబుతున్నాడు.

పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లైన వసీ అక్రం, షోయబ్ అఖ్తర్ ఇద్దరూ ఇస్తున్న సలహా, సూచనలతోనే ఉమేశ్ అద్భుతంగా రాణించగలుగుతున్నాడట! ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన ఉమేష్.. ఆ సమయంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ గా వున్న అక్రంతో కలిసి పనిచేయడమే అతని కెరీర్ ను కీలక మలుపు తిప్పిందట! ఆసీస్ పిచ్ లపై ఎలా బౌలింగ్ చేయాలోనన్న విషయంపై ఉమేష్ కి అక్రం పాఠాలు చెప్పాడట! ఇప్పటికీ బౌలింగ్ లో ఏదైనా సందేహం వస్తే ఉమేష్ నేరుగా అక్రంకి ఫోన్ చేస్తాడని రమేష్ చెప్పాడు. ఇక మ్యాచ్ కి ముందు మానసికంగా ఎలా సిద్ధమవ్వాలన్న అంశంపై ఉమేష్ కి అఖ్తర్ కొన్ని సూచనలు ఇచ్చాడట!

వారిద్దరూ ఇచ్చిన ఆ సలహాల మేరకే ఇతగాడు ఆసీస్ పిచ్ లపై మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నాడని రమేష్ పేర్కొంటున్నాడు. ఇదిలావుండగా.. ఆసీస్ పిచ్ లపై అద్భుతంగా రాణిస్తున్న మరొక బౌలర్ మహ్మద్ షమీ కూడా అక్రం, అఖ్తర్ లు చెప్పిన సలహాలతోనే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతున్నానంటూ స్వయంగా అతడే ప్రెస్ మీట్ లో వెల్లడించిన విషయం తెలిసిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bowler umesh yadav  wasim akram  shoaib akhtar  ramesh yadav  

Other Articles