Indore saree company prepare gifts for mahendra singh dhoni for worldcup

mahendra singh dhoni, indore sarees company, bcci, worldcup 2015, india cricket team, india vs australia match, dhoni latest news, dhoni updates, dhoni photos, dhoni worldcup 2015, dhoni with cricket team members

indore saree company prepare gifts for mahendra singh dhoni for worldcup : If Team India Captain Mahendra Singh Dhoni will come with worldcup this time... Indore private company will give him a special sarees as gift which costs 65 thousand each.

టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. ధోనీకి చీరలిస్తారట!

Posted: 03/23/2015 04:01 PM IST
Indore saree company prepare gifts for mahendra singh dhoni for worldcup

ప్రపంచకప్ టోర్నమెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా కొనసాగుతున్న ఇండియా క్రికెట్ జట్టు.. తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచులు గెలవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ లో బంగ్లాదేశ్ పై భారత్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ విధంగా ఇండియా వరుసగా గెలవడంతోపాటు ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే.. ఈ ఏడుమ్యాచుల్లోనూ ఇండియ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను పవెలియన్ పంపించింది. అంటే.. 70 వికెట్లు తీసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా ఇండియా రికార్డులపుటకెక్కింది.

ఇక ఈనెల 26వ తేదీన ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఇండియా సన్నద్ధమవుతోంది. అత్యంత ప్రతిభాశాలిగా పేరున్న ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుపై విజయం సాధించాలనే పట్టుదలతో ఆటగాళ్లున్నారు. అలాగే అభిమానులు సైతం ఇండియా గెలుస్తుందన్న అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. సెమీస్ లో ఇండియా నెగ్గితే.. ఆ తర్వాత టైటిల్ మనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇండియా ప్రపంచకప్ టైటిల్ గెలిస్తే.. వారికి ఎటువంటి ఘనస్వాగతం లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు, ఇంకా ఎన్నెన్నో లభిస్తాయి.

అయితే.. టీమిండియా సారథి అయిన మహేంద్రసింగ్ ధోనీకి మాత్రం ఇప్పుడే ఓ అరుదైన బహుమతిని ఖరారు చేసి పెట్టారు. వరల్డ్ కప్ తో ధోనీ ఇండియాకు తిరిగి వస్తే.. అతనికి బహుమానంగా ప్రత్యేకంగా తయారుచేసిన చీరలు ఇస్తామంటూ ఇండోర్ కు చెందిన ఓ సంస్థ ప్రకటించింది. అతనికిచ్చే ఒక్కొక్క చీరవిలువ రూ.65 వేలు విలువ చేస్తాయట! ఆ చీరల్లో వరల్డ్ కప్ టైటిల్, బీసీసీఐ లోగులు ముద్రించారు. ఇటీవలే ఇండోర్ లో సదరు సంస్థ ఆ చీరలను ప్రదర్శనకు కూడా పెట్టింది. ఈ చీరలే ధోనీకి గిఫ్టుగా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  icc worldcup 2015  india vs australia match  

Other Articles