Pakistan fan at india nets meets dhoni

Pakistan fan at India nets, Mohammed Bashir Chicago-based Pakistani, Bashir is supporting India, bashir shirt was full of MS Dhoni's pictures, indian practice, dhoni daughter, dhoni sakshi daughter, dhoni latest updates, dhoni latest news, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015

Mohammed Bashir a Chicago-based Pakistani is supporting India. He came wearing a shirt that was full of MS Dhoni's pictures.

అమ్మాయి అదృష్టాన్ని తెచ్చింది..కప్ మీదే..

Posted: 02/22/2015 07:58 PM IST
Pakistan fan at india nets meets dhoni

నీ ఇంటి మహాలక్ష్మీ  నీకుఅదృష్టాన్ని తీసుకువచ్చింది. ఈ సారి కూడా విజయం మీదే అని ఎవరైనా ఎవరితోనైనా అనగానే ఆ తండ్రి ముఖంలో వేయి వోల్టుల బల్బులు వెలిగినంత కాంతి కనబడుతుంది. ఇదే మాట టీమిండియా సారధి మహేంద్ర సింగ్ ధోణిని అంటే ఆయన కూడా చిరుమంద హాసాన్ని వెలిబుచ్చుతాడు. తనకు కూతరు పుట్టిందని తెలసినా.. ప్రపంచ కప్ నేపథ్యంలో అస్ట్రేలియాలోనే వున్న ధోణి కనీసం కూతురును చూడటానికి కూడా రాలేదు దోణి. ఇదిలావుంటే ఈ సారి మళ్లీ ప్రపంచకప్‌తో తిరిగి వెళతావు’... అంటూ భారత జట్టు ప్రాక్టీస్ సందర్భంగా ధోనికి ఓ అభిమాని చెప్పారట. సరే అభిమాని కదా, కొద్దిగా అతిశయోక్తిని జోడించి వుంటాడని అనుకునేరూ.. అయిన ఇండియన్ కాదు. ధాయాది దేశం పాకిస్తాన్  క్రికెట్ వీరాభిమాని చెప్పిన మాటలు.

వివరాల్లోకి వెళితే... బషీర్ అనే పాకిస్తాన్ వీరాభిమాని.... భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా రెండు దేశాల జెండాలతో హాజరవుతాడు. అడిలైడ్‌లోనూ భారత్, పాక్ మ్యాచ్ చూశాడు. పాక్ జట్టు ఆట చూసి విరక్తి పుట్టిందేమో... భారత జట్టు వెంట తిరుగుతున్నాడు. కారణం... ధోనికి తను వీరాభిమాని.  గత ఏడాది టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ధోనియే బషీర్‌కు టిక్కెట్ ఇచ్చాడు. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ దగ్గరకు వచ్చిన బషీర్... తన టీ షర్ట్‌పై ‘ధోని ఐ లవ్ యూ’ అని రాసుకున్నాడు. బషీర్‌ను గుర్తుపట్టిన ధోని తనని చిరునవ్వుతో పలకరించాడు. అంతే కాదు... బషీర్ టీ షర్ట్‌పై సంతకం చేశాడు. ఈ సందర్భంగా ‘నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది...’ అంటూ బషీర్ చెప్పగానే ధోని ముసిముసినవ్వులు నవ్వుతూ వెళ్లాడు. బషీర్‌కు రోహిత్ శర్మ తన కళ్లద్దాలను బహుమతిగా ఇవ్వడం కొసమెరుపు. అమెరికాలో రెస్టారెంట్ నడుపుకునే ఈ పాకిస్తాన్ జాతీయుడి  అత్తగారి ఊరు మన హైదరాబాదే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  mohammed bashir  india  

Other Articles