Vvs laxman conferred with honorary doctorate degree

V V S conferred with honorary doctorate, Laxman honored doctorate by TERI University, Former India batsman V V S Laxman, Cricket, VVS Laxman, TERI University, ODI cricket, Former India Test cricketer, sports, Hitachi Chairman and CEO Hiroaki Nakanishi, former East Timor President Jose Manuel Ramos-Horta, Unilever CEO Paul Polman, vvs photos, vvs laxman achivements, vvs laxman records, vvs laxman awards

Former India batsman V V S Laxman was conferred with the honorary doctorate degree by the TERI University in its seventh convocation ceremony here.

డాక్టర్ గా మారిన హైదరాబాదీ మాజీ క్రికెటర్..

Posted: 02/05/2015 04:18 PM IST
Vvs laxman conferred with honorary doctorate degree

భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా టెస్టు క్రికెట్ మాజీ సారధి వీవీఎస్ లక్ష్మణ్ కు టెరి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన టెరి యూనివర్శిటీ ఏడవ స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను డాక్టరేట్ పట్టాతో గౌరవించింది. లక్ష్మణ్ తో పాటు మరో ముగ్గురిని డాక్టరేట్ డిగ్రీలతో సత్కరించారు. ఈస్ట్ తైమూర్ మాజీ అధ్యక్షుడు జోస్ మన్యుయేల్, రామోస్ హోర్టా, యూనీలీవర్ సీఈఓ పాల్ పోల్మన్, హిటాచీ చైర్మన్ అండ్ సీఈఓ హారోకీ నకనిషిలకు టెరి యూనివర్శిటీ సత్కరించింది.

ఈ సందర్భంగా క్రికెటర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనకు డాక్టరేట్ పట్టాను ఇచ్చి సత్కరించిన టెరి యూనివర్శటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు చిన్నతనంలో డాక్టర్ కావాలని వుండేదని, అయితే దేశానికి ప్రాతినిథ్యం మహించాలన్న తన కలను సాకారం చేసుకున్నానని అందుకు కూడా తాను సంతోషిస్తున్నానన్నారు. కాగా తన కల ఇన్నాళ్లకు ఇలా తీరినందుకు ఆనందంగా వుందన్నారు. యువత ఇప్పుడే తమకు కావలసింది ఎంచుకుని దేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా అయా రంగాలలో రాణించాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vvs laxman  dotorate  teri university  cricket  

Other Articles