India loss second melbourne oneday match against australia team

india australia oneday matches, melbourne oneday match, india australia melbourne oneday match, rohit sharma records, indian bowlers, indian batsman, indian cricketers,

india loss second melbourne oneday match against australia team

రెండో వన్డేలో ఇండియాను ‘కంగారు’ పెట్టించేశారుగా...

Posted: 01/18/2015 06:00 PM IST
India loss second melbourne oneday match against australia team

ముక్కోణపు సిరీస్’లో భాగంగా మెల్’బోర్న్’లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో మ్యాచ్’లో చివరికి ‘కంగారు’ పెట్టించేశారు. ఈసారి కూడా ఇండియన్ ఆటగాళ్లు ఆసిస్ దెబ్బకు తమ చేతులను ముడుచుకుని పవేలియన్ వైపుకు తలదించుకుని నడవాల్సి వచ్చింది. గెలుపు అంచులదాకా వెళ్లి తీరా ఓడిపోయింది భారత్ జట్టు! తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన అరుదైన అవకాశాల్ని చేజేతులా మిస్ చేసుకుంటున్నారు ఆటగాళ్లు! ఏదైతేనేం.. మరోసారి పరదేశంలో భారత్ ప్రతిష్టను దిగజార్చేశారు. వరుసగా రెండుసారి ఆసిస్ చేతిలో పరాజయం పొందారు.

రెండు వన్డేలో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. మొదట్లో కాస్త నత్తనడక పెర్’ఫార్మెన్స్’తోనే కొనసాగించింది. ఇక కోహ్లీ 9 పరుగులు, కెప్టెన్ ధోనీ 19 పరుగులకే ఔట్ అయ్యి ఛైర్’లో కూర్చొని సేద తీర్చుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. తన అద్భుత ప్రతిభతో సెంచరీ చేయడమే కాకుండా రికార్డులు సృష్టించారు. తాను ఫోర్ కొట్టకుండా నాలుగు పరుగులు చేసి చరిత్రలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అంతేకాదు.. మెల్’బోర్న్ స్టేడియంలో ఒక్క మ్యాచ్’లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగానూ, అత్యధిక సిక్స్’లు కొట్టిన ఆటగాడిగా మరో రెండు రికార్డులను నమోదు చేసి, భారత్ గౌరవాన్ని చాటిచెప్పాడు. 139 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 138 పరుగులు చేసిన అనంతరం ఔటయ్యాడు.

ఇక యువతేజం రైనా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. రోహిత్ శర్మకు జోడిగా క్రీజులో ఎక్కువసేపు వున్న ఈ ఆటగాడు.. 51 పరుగులు చేశాడు. ఇక చివర్లో అన్నీ వికెట్లు టపటపామంటూ వరుసగా పడిపోవడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 267 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఇక ఆసిస్ బౌలింగ్ విభాగంలో బౌలర్ స్టార్క్ చెలరేగిపోయాడు. మొత్తం 10 ఓవర్లు వేసిన ఇతగాడు 43 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఈ బౌలర్ దెబ్బకే భారత్ ఆటగాళ్లు వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ ఆటగాళ్లు.. మొదటినుంచే చెలరేగిపోయారు. ఓపెనర్లు తమవంతు స్కోరును జోడించి ఔటైతే.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తమ ప్రతిభను చాటిచెప్పారు. వీరిలో ఫించ్ 96, స్మిత్ 47, వాట్సన్ 41, వార్నర్ 24, మాక్స్ వెల్ 20, హాడిస్ 13 పరుగులు చేసి.. తమ జట్టును విజయబాటవైపు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఫించ్ అద్భుతంగా రాణించాడు. దీంతో కంగారూలు ఇంకా ఓవర్ మిగిలుండగానే 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించారు. దీంతో రోహిత్ పడిన కష్టం వృథా అయిపోయింది. చివర్లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్’గా ఆసిస్ బౌలర్ స్టార్క్ ఎన్నుకోబడ్డాడు.

ఇండియా బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్ తన ప్రతిభతో ఆసిస్ జట్టుకు కాస్త చెమటలు పట్టించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఉమేశ్ 2 వికెట్లు తీసుకోగా.. భువనేశ్వర్, షమి, పటేల్, అశ్విన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india austrlia oneday series  melbourne oneday match  

Other Articles